ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌టీ లైన్‌పై కోతి.. షాక్‌తో మృతి

ABN, First Publish Date - 2022-09-24T06:52:18+05:30

హైటెన్షన్‌ విద్యుత్తు తీగలపై కోతి పడడంతో ఇన్సులేటర్లు, క్లాంపులు పేలిపోయాయి. దీంతో సీలేరు గ్రామంలో సుమారు ఏడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జీకేవీధి మండలంలోని సీలేరు, పరిసర గ్రామాలకు స్థానిక జలవిద్యుత్‌ కేంద్రం నుంచి (220 కేవీ/33 కేవీ/ 11 కేవీ లైన్లకు

ట్రాన్స్‌ఫార్మర్‌ను బాగు చేస్తున్న జెన్‌కో సిబ్బంది.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీలేరులో ఏడు గంటలపాటు నిలిచిన విద్యుత్‌ సరఫరా



సీలేరు, సెప్టెంబరు 23: హైటెన్షన్‌ విద్యుత్తు తీగలపై కోతి పడడంతో ఇన్సులేటర్లు, క్లాంపులు పేలిపోయాయి. దీంతో సీలేరు గ్రామంలో సుమారు ఏడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జీకేవీధి మండలంలోని సీలేరు, పరిసర గ్రామాలకు స్థానిక జలవిద్యుత్‌ కేంద్రం నుంచి (220 కేవీ/33 కేవీ/ 11 కేవీ లైన్లకు స్టెప్‌డౌన్‌ చేసి అనంతరం) విద్యుత్‌ సరఫరా చేస్తుంటారు. శుక్రవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో సీలేరు మొత్తం విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏపీ జెన్‌కో ఇంజనీర్లు, ఉద్యోగులు వెంటనే స్విచ్‌యార్డుకు వెళ్లి పరిశీలించారు. హెచ్‌టీ తీగలపై పడి చనిపోయిన కోతిని గుర్తించారు. దీని ప్రభావంతో 11 కేవీ విద్యుత్‌ లైన్‌లో మూడు ఇన్సులేటర్లు, 33 కేవీ విద్యుత్‌ లైన్‌లో మూడు ఇన్సులేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర క్యాంప్‌లు పేలిపోయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్టు నిర్ధారించుకున్నారు. పాడైపోయిన ఇన్సులేటర్లను, క్లాంప్‌లను తొలగించి కొత్తవాటిని అమర్చారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. 


Updated Date - 2022-09-24T06:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising