ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఓటర్లు 2,43,903

ABN, First Publish Date - 2022-11-24T01:47:42+05:30

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను బుధవారం విడుదల చేశారు. మొత్తం 2,43,903 మంది ఓటర్లుగా నమోదయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాంధ్ర పట్టభద్ర స్థానం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

పురుషులు 1,55,803, మహిళలు 88,062, ట్రాన్స్‌ జండర్లు 38

గరిష్ఠంగా విశాఖ జిల్లాలో 80,105 మంది..తక్కువగా అల్లూరి జిల్లాలో 10,200మంది

వచ్చే నెల తొమ్మిది వరకు అభ్యంతరాల స్వీకరణ

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను బుధవారం విడుదల చేశారు. మొత్తం 2,43,903 మంది ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో 1,55,803 మంది పురుషులు, 88,062 మంది మహిళలు, 38 మంది ట్రాన్స్‌జండర్లు ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే గరిష్ఠంగా విశాఖ జిల్లాలో 80,105 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కాగా, అతి తక్కువగా అల్లూరి జిల్లాలోని పాడేరు డివిజన్‌లో గల 11 మండలాల్లో 10,200 మంది ఓటర్లు ఉన్నారు.

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గత నెల ఒకటో తేదీ నుంచి ఓటర్ల నమోదుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 2,67,728 మంది ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వచ్చిన వాటిలో 23,800 దరఖాస్తులను తిరస్కరించారు. పదో తరగతి/పాలిటెక్నిక్‌ చదివినవారు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి కొందరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు రెండు, మూడు దరఖాస్తులు అందజేశారు. వీటన్నింటినీ తిరస్కరించి, అన్నీ పక్కాగా వున్న 2,43,903 మందిని ఓటర్లుగా గుర్తిస్తూ ముసాయిదా జాబితాను విశాఖ కలెక్టర్‌, ఎన్నికల అఽధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జున బుధవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు బుధవారం నుంచి వచ్చే నెల తొమ్మిదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ ఎన్నిక కోసం మొత్తం 297 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు.

ముసాయిదా ఓటర్ల జాబితా జిల్లా

జిల్లా పోలింగ్‌ కేంద్రాలు ఓటర్లు

పురుషులు మహిళలు ట్రాన్స్‌జండర్లు మొత్తం

శ్రీకాకుళం 57 32,351, 13,764 4 46,119

విజయనగరం 64 35,787 18,670 9 54,466

పార్వతీపురం మన్యం 24 11,544 5,507 1 17,052

అల్లూరి సీతారామరాజు14 7,085 3,112 3 10,200

విశాఖపట్నం 94 44,805 35,287 13 80,105

అనకాపల్లి 44 24,231 11,722 8 35,961

Updated Date - 2022-11-24T01:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising