ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ కసరత్తు

ABN, First Publish Date - 2022-10-17T07:19:32+05:30

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం కోసం చేపట్టాల్సిన అంశాలపై నేతలు ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశమైన టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, అక్టోబరు 16:


ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్థి విజయం కోసం చేపట్టాల్సిన అంశాలపై నేతలు ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.  పార్టీ అభ్యర్థి గాడు చిన్నకుమారిలక్ష్మి విజయానికి ఏ విధంగా ముందుకు పోవాలో నిర్దేశిస్తూ అధిష్ఠానం పంపిన ప్రణాళికపై సమావేశంలో నేతలు చర్చించారు. ఎన్నికల్లో కీలకంగా భావించే ఓటర్ల నమోదుపై  నియోజకవర్గాల వారీగా నాయకులు ఫోకస్‌ పెట్టాలని సమావేశం నిర్ణయించింది. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రతి విద్యార్థిని కలిసి ఓటరుగా నమోదుచేసుకునేలా అవగాహన కల్పించాలని ప్రతిపాదించారు. విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విశాఖ దక్షిణ, భీమిలి ఇన్‌చార్జిలు గండి బాబ్జీ, కోరాడ రాజబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్నికుమారి లక్ష్మి, జీవీఎంసీలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌  పీలా శ్రీనివాస్‌, పార్టీ నేతలు పాశర్ల ప్రసాద్‌, చోడే పట్టాభి, చిక్కాల విజయ్‌, పోతనరెడ్డి, బొండా జగన్‌, రాజమండ్రి నారాయణ, ఆరేటి మహేష్‌, ఒమ్మి సన్యాసిరావు, కాళ్ల శంకర్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T07:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising