ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూర, కోడిగుడ్డు లేని భోజనం!

ABN, First Publish Date - 2022-01-20T06:16:35+05:30

విద్యార్థులకు కూర, కోడిగుడ్డు లేకుండా మధ్యాహ్న భోజనం పెట్టడంపై ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మధ్యాహ్న భోజనంపై నిర్వాహకురాలిని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చారుతో అన్నం తింటున్న విద్యార్థులు

నిర్వాహకురాలిని నిలదీసిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి 

మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడిపై ఆగ్రహం

ఐటీడీఏ పీవోకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక


కొయ్యూరు, జనవరి 19: విద్యార్థులకు కూర, కోడిగుడ్డు లేకుండా మధ్యాహ్న భోజనం పెట్టడంపై ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  బుధవారం మధ్యాహ్న ఆమె కొయ్యూరు శివారు చింతవానిపాలెం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తుండడంతో మెనూ గురించి ఆరా తీశారు. ఎవరి ప్లేట్‌లో కూడా కూర, కోడిగుడ్డు లేవు. కేవలం చారుతో పిల్లలు భోజనం చేస్తున్నారు. దీంతో మెనూ ప్రకారం భోజనం ఎందుకు పెట్టడంలేదని నిర్వాహకురాలిని నిలదీశారు. ఉపాధ్యాయుడు నేతల అప్పారావు మద్యం సేవించి ఉండడం, ఐదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయకుండా బీరువాలో వుంచడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్యాంశాలపై విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయగా, కనీస సమాధానం చెప్పకపోవడంతో ఉపాధ్యాయుడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు.


Updated Date - 2022-01-20T06:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising