ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి అమర్‌ పాత్ర

ABN, First Publish Date - 2022-05-20T06:27:22+05:30

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు.

మాట్లాడుతున్న పీలా గోవింద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపణ

కొత్తూరు, మే 19 : తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండలంలోని తగరంపూడి, సీతానగరం గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చెరకు రైతులపై కోపంతోనే నల్లబెల్లంపై ఆంక్షలు విధించారన్నారు. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీపై మంత్రి అమర్‌నాథ్‌ వివరణ ఇవ్వకపోవడం ఆయన చేస్తున్న కుట్రకు నిదర్శనమన్నారు. అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు ఒక్కపూటే పని కల్పించాలన్నారు. నల్లబెల్లంపై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లారు. బకాయిలు చెల్లించకపోతే ఉపాధి కూలీలు ఏవిధంగా బతకాలని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఉపాధి కూలి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, నడిపల్లి గణేశ్‌, మువ్వల అప్పలనాయుడు, బండారు రామారావు, నక్కా చెల్లయ్య, అందిబోయిన అప్పలనాయుడు, రాపేటి రాము, ప్రకాశ్‌, చందక నరసింగ్‌, సూర్య, కన్నంనాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising