‘గడప గడపకూ’ పనులకు రూ.10.59 కోట్లు మంజూరు
ABN, First Publish Date - 2022-12-15T23:56:39+05:30
మాడుగుల నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటివరకు వచ్చిన వినతుల్లో రూ.10.59 కోట్లు విలువైన పనులు మంజూరు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.
దేవరాపల్లి, డిసెంబరు 15: మాడుగుల నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటివరకు వచ్చిన వినతుల్లో రూ.10.59 కోట్లు విలువైన పనులు మంజూరు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. మండల కేంద్రంలోని నాలుగురోడ్లు కూడలిలో నిర్మిస్తున్న సిమెంటు రోడ్లు, డ్రైన్‌లను పరిశీలించిన అనంతరం గురువారం రాత్రి ఇంజనీరింగ్ అధికారులతో రైవాడ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. నాలుగు రోడ్లు కూడలి నుంచి పాత మెట్లు రేవు వరకు విస్తరణ పనులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్ భవనాలకు అదనంగా రూ.3లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్‌ఈ బీవీ రవీంద్ర, ఈఈ కె.వీరన్నాయుడు, డీఈఈ రమణ, అధికారులు ఉన్నారు.
Updated Date - 2022-12-15T23:56:42+05:30 IST