ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అస్తవ్యస్తం
ABN, First Publish Date - 2022-12-16T23:45:37+05:30
ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఎంపీపీ కోరాబు అనుషదేవి అసహనం వ్యక్తం చేశారు.
పోస్టులు భర్తీ చేయాలని కలెక్టర్‌కు లేఖ
మండల అధ్యక్షురాలు కోరాబు అనుషదేవి
చింతపల్లి, డిసెంబరు 16: ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఎంపీపీ కోరాబు అనుషదేవి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీడీవో లాలం సీతయ్యతో కలిసి శుక్రవారం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బెడ్ షీట్లు లేకపోవడంపై ఎంపీపీ మండిపడ్డారు. ఆస్పత్రి మెయిన్ బోర్డు, పాలవర్గం సభ్యుల బోర్డులను మూడు రోజుల్లో మార్చాలని, లేదంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని వైద్యులను హెచ్చరించారు. అనంతరం విలేకర్లతో ఎంపీపీ మాట్లాడుతూ ఆస్పత్రిలో అత్యత్తుమ సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందిన సూపరింటెండెంట్ మహేశ్వరరావు డీఎంహెచ్‌వోగా పదోన్నతి వెళ్లిపోయారన్నారు. రోగులకు అన్నివేళలా అందుబాటులో ఉండే రఘురామ్ పీజీకి, డీకే హిమబిందు ధారకొండ పీహెచ్‌సీకి వెళ్లారన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఎస్‌ఎన్‌సీయూకి చెందిన ఇద్దరు చిన్నపిల్లల వైద్య నిపుణులతో పాటు ఒక జనరల్ వైద్యులు(ఎంబీబీఎస్) ఉన్నారన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సాధారణ చికిత్స అందించేందుకు ఒకే ఒక వైద్యాధికారి అందుబాటులో ఉండడం వల్ల రోగులకు సకాలంలో సేవలు అందడం లేదన్నారు. పూర్తి స్థాయిలో వైద్యులు, నిపుణుల ఖాళీలను భర్తీ చేయాలని, అంతవరకు పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌ను ఏరియా ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై నియమించాలని కలెక్టర్, ఐటీడీఏ పీవో, పాడేరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్తామని ఆమె తెలిపారు.
Updated Date - 2022-12-16T23:45:43+05:30 IST