ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేయర్‌ ఆగ్రహం!

ABN, First Publish Date - 2022-05-18T07:07:40+05:30

మేయర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో కోపం పెల్లుబికింది.

ఎంవీపీలో అధికారులకు సూచనలు ఇస్తున్న మేయర్‌ హరి వెంకట కుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జీతం నిలుపుదల

సూపర్‌ వైజర్‌పై బదిలీ వేటు

పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో చర్యలు 

ఎంవీపీ కాలనీలో ఆకస్మిక తనిఖీలు 


ఎంవీపీ కాలనీ, మే 17: మేయర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో కోపం పెల్లుబికింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రథమ స్థానానికి పోటీ పడుతున్న నగరాన్ని ఇలా ఉంచుతారా...మీరు బాధ్యతగా పనిచేయకపోతే పర్యవసనాలు కూడా అంతే కఠినంగా ఉంటాయని హెచ్చరించడంతో పాటు ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జీతం నిలుపుదల చేయాలని, సూపర్‌వైజర్‌ను బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంవీపీ కాలనీలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగరంలో పారిశుధ్య పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించేందుకు మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మంగళవారం ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 1, 2లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడం, కాలువల్లో పూడిక తీయకపోవడాన్ని ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాల్సిన సిబ్బంది ఇలా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కిశోర్‌కు నెల రోజుల జీతాన్ని నిలిపివేయాలని, సూపర్‌వైజర్‌ (మేస్త్రీ) అబ్దుల్‌ సుభానీ (గౌస్‌)ని అనకాపల్లి బదిలీ చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. కాలువలు, రోడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. నిర్ధారించిన సమయానికే పారిశుధ్య కార్మికులంతా పిన్‌పాయింట్‌ వారీగా బాధ్యతల్లో ఉండాలన్నారు. రూట్‌మ్యాప్‌ ప్రకారం చెత్త తరలించే వాహనాలు నిర్దిష్ట సమయానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 17వ వార్డు కార్పొరేటర్‌ గేదెల లావణ్య, జోనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T07:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising