మే 15 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు
ABN, First Publish Date - 2022-03-05T06:08:37+05:30
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను మే 15, 16, 17 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
పాడేరు, మార్చి 4: స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను మే 15, 16, 17 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాల తేదీలను ఖరారు చేసేందుకు ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, కొట్టగుళ్లి సింహాచలంనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాలకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఇప్పటికే ఉన్నతాధికారులను కోరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఉత్సవాలు జరగకపోవడంతో, ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవ కమిటీని మరో మూడు రోజుల్లో ప్రకటిస్తామని ఎమ్మెల్యే తెలియ జేశారు. ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు టి.నరసింగరావు, మాజీ మంత్రి మణికుమారి, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, వర్తక సంఘాల నేతలు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T06:08:37+05:30 IST