ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంలో ముసురు

ABN, First Publish Date - 2022-06-28T05:47:24+05:30

త మూడు రోజులుగా మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. సోమవారం సైతం ఏజెన్సీలో పలు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి.

వర్షానికి తడిచి ముద్దయిన పాడేరు- అరకులోయ మెయిన్‌రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు మండలాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు 


పాడేరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): గత మూడు రోజులుగా మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. సోమవారం సైతం ఏజెన్సీలో పలు మండలాల్లో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లా కేంద్రం పాడేరులో సోమవారం ఉదయం ఒక మోస్తారుగా వర్షం కురిసింది. పది గంటల తరువాత తెరిపి ఇచ్చి ఎండ కాసింది. కానీ ఎండ ఎక్కువ సమయం లేదు. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వర్షానికి రోడ్లన్నీ తడిచి ముద్దయ్యాయి. హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అనంతగిరి మండలంలోని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతంలో ఒక మోస్తారు వర్షం కురవగా, ముంచంగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకున్నా వానజాడ లేదు. తాజా వర్షాలు ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయని రైతులు అంటున్నారు.



Updated Date - 2022-06-28T05:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising