ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ముసురు’కున్న మన్యం

ABN, First Publish Date - 2022-07-06T06:10:38+05:30

కొన్ని రోజులుగా మన్యాన్ని ముసురు వదలడం లేదు. సుమారు పది రోజులుగా ఏజెన్సీలో నిత్యం ఏదో చోట వర్షం కురుస్తూనే ఉంది.

పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌లో వర్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏజెన్సీలో పది రోజులుగా కొనసాగుతున్న వాన


పాడేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కొన్ని రోజులుగా మన్యాన్ని ముసురు వదలడం లేదు. సుమారు పది రోజులుగా ఏజెన్సీలో నిత్యం ఏదో చోట వర్షం కురుస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం సైతం ఏజెన్సీలో అక్కడక్కడ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం ఉదయం ఒక మోస్తరుగా జల్లులతో కూడిన వర్షం కురిసింది. పది గంటల తరువాత తెరిపి ఇచ్చినప్పటికీ ఎండ కాయలేదు. ఆకాశం మబ్బులతో ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వర్షానికి రోడ్లు తడిసి ముద్దయ్యాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో ఉదయం ఒక మోస్తరు వర్షం కురిసింది. జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగింది.

ముంచంగిపుట్టు: మండల పరిధిలో మంగళవారం ఉదయం వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం కాస్త తెరిపి ఇచ్చింది. వాగులు వరదనీటితో కళకళలాడుతున్నాయి. రహదారులు చిత్తడిగా మారాయి. మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పలు చోట్ల దెబ్బతిన్నాయి. అటుగా రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. 

Updated Date - 2022-07-06T06:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising