ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ డ్రైవర్‌ దారుణ హత్య

ABN, First Publish Date - 2022-10-31T01:24:21+05:30

ఓ లారీ డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక వియ్యపువానిపాలెంలో అర్ధరాత్రి ఘటన

హతుడితోపాటు భార్య మొబైల్‌ ఫోన్ల కాల్‌ డేటాను పరిశీలించిన పోలీసులు

ఆమెతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ?

గాజువాక, అక్టోబరు 30:

ఓ లారీ డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గాజువాక అంబేడ్కర్‌ కాలనీ రోడ్డులో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. ఈ హత్యకు సంబంధించి న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలు...

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సీహెచ్‌బీ అగ్రహారానికి చెందిన మైలారపు అప్పారావు(45) కుటుంబంతో సహా నాలుగేళ్ల క్రితం గాజువాక వచ్చాడు. వియ్యపువానిపాలెంలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఉమ గాజువాకలోని ఓ హోటల్‌లో స్వీపింగ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అప్పారావు శనివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చి కొద్దిసేపటి తరువాత బయటకు వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో రోడ్డుపై అంబేడ్కర్‌ కాలనీ రోడ్డులో అప్పారావు నిర్జీవంగా పడివుండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. న్యూపోర్టు పోలీసు స్టేషన్‌ సీఐ రాము సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంటి అద్దె చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో, తన చెవిదిద్దులు తాకట్టుపెట్టి డబ్బులు తెస్తానని చెప్పి శనివారం రాత్రి తన భర్త బయటకు వెళ్లాడని ఉమ పోలీసులకు చెప్పారు. అయితే ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి అప్పారావు ఇంటికి వచ్చి, అతడిని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారని, అప్పారావును వారే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏడీసీపీ శ్రావణ్‌ కుమార్‌, డీసీపీ సుమిత్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా మృతుడితోపాటు అతని భార్య మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌ డేటాను పరిశీలించారు. హతుడి భార్యతోపాటు, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - 2022-10-31T01:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising