ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతవానిపాలెం పాఠశాలకు తాళాలు

ABN, First Publish Date - 2022-06-30T06:25:23+05:30

ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తరలించడాన్ని నిరసిస్తూ బుచ్చెయ్యపేట శివారు నేతవానిపాలెంలో విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశారు.

నేతవానిపాలెం పాఠశాల వద్ద ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరగతుల తరలింపునకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఆందోళన

బుచ్చెయ్యపేట, జూన్‌ 29: ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు తరలించడాన్ని నిరసిస్తూ బుచ్చెయ్యపేట శివారు నేతవానిపాలెంలో విద్యార్థులు, తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశారు. పాఠశాలకు తాళాలు వేసి  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రాఽథమిక పాఠశాలకు కిలోమీటరు దూరంలో ఉన్న జడ్పీ హైస్కూల్‌కి చిన్నారులు రోజూ ఎలా వెళ్లి వస్తారని ప్రశ్నించారు. పైగా హైస్కూల్‌లో సరిపడ ఉపాధ్యాయులు లేరని, మౌలిక సదుపాయాలు కూడా లేవని అన్నారు. తరగతుల విలీనం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని లేదంటే తమ పిల్లలను బడికి పంపేదిలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ ఛైర్మన్‌ భరణికాన దేవుళ్లు, ఎంపీటీసీ సభ్యుడు సూరిశెట్టి వెంకటరమణ, బియ్యపు రాము తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T06:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising