ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు

ABN, First Publish Date - 2022-06-29T06:04:49+05:30

రైతులు, డ్వాక్రా మహిళలకు వెంటనే రుణాలు అందిస్తామని కెనరాబ్యాంకు డీజీఎం వినయ్‌కుమార్‌ ఆచార్య అన్నారు.

రైతు సదస్సులో మాట్లాడుతున్న కెనరా బ్యాంకు డీజీఎం వినయ్‌కుమార్‌ ఆచార్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కెనరా బ్యాంకు డీజీఎం వినయ్‌కుమార్‌ ఆచార్య

చీడికాడ, జూన్‌ 28: రైతులు, డ్వాక్రా మహిళలకు వెంటనే రుణాలు అందిస్తామని కెనరాబ్యాంకు డీజీఎం వినయ్‌కుమార్‌ ఆచార్య అన్నారు. మంగళవారం ఇక్కడ రైతులు, డ్వాక్రా మహిళలతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కోసం రుణాలు మంజూరు చేస్తామన్నారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే మరింతగా రుణాన్ని అందిస్తామన్నారు. బ్యాంకు ఏజీఎం నరసింహరావు మాట్లాడుతూ, రైతులు, డ్వాక్రా మహిళలకు సెప్టెంబరు నెలాఖరు వరకూ రుణాలు అందిస్తామన్నారు. వ్యవసాయ సలహా కమిటీ చైర్‌పర్సన్‌   యర్రా అప్పారావు మాట్లాడుతూ.. పంట రుణాలు తీసుకున్న రైతులు తొలి ఏడాదే తిరిగి బ్యాంకునకు చెల్లించినపుడు మొదటి ఏడాదికే కాకుండా రెండేళ్లకు ఒకేసారి వడ్డీ తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సదస్సులో బ్యాంకు డీఎం కృష్ణప్రభు, మేనేజర్లు శివగణేశ్‌, సతీశ్‌, రీజనల్‌ ఆఫీస్‌ సిబ్బంది ఆదిరెడ్డి సతీశ్‌, శేషగిరిరావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సత్యనారాయణరాజు, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు పోతల చిన్నంనాయుడు, గండి ముసలినాయుడు, బొడ్డు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-29T06:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising