ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెస్‌లో చిన్నారి మీనాక్షి రికార్డు

ABN, First Publish Date - 2022-12-07T01:03:00+05:30

నగరానికి చెందిన చెస్‌ చిన్నారి క్రీడాకారిణి కొలగట్ల అలన మీనాక్షి అరుదైన ఘనత సాధించింది. అతి చిన్న వయసులో (11 ఏళ్లు) ఫిడే మాస్టర్‌ టైటిల్‌ సాధించి విశాఖకు కీర్తిని తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 6:

నగరానికి చెందిన చెస్‌ చిన్నారి క్రీడాకారిణి కొలగట్ల అలన మీనాక్షి అరుదైన ఘనత సాధించింది. అతి చిన్న వయసులో (11 ఏళ్లు) ఫిడే మాస్టర్‌ టైటిల్‌ సాధించి విశాఖకు కీర్తిని తెచ్చింది. అంతేకాకుండా స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతున్న అధికారిక ఫిడే చెస్‌బుల్‌ అకాడమీ క్యాంపునకు ఎంపికైంది. ఈ అకాడమీ క్యాంపునకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 12 మందిలో మీనాక్షి ఒకరు కావడం విశేషం. ఫిడే చెస్‌బుల్‌ అకాడమీలో ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా 350 మంది ఆటగాళ్లు పోటీపడగా...అత్యుత్తమ ప్రతిభ గల 12 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీని సమర్థంగా ఎదుర్కొని ప్రతిష్టాత్మక క్యాంపునకు ఎంపికైన మీనాక్షి...ఈ నెల 11వ తేదీ వరకు జరిగే శిబిరంలో ప్రపంచ చాంపియన్లు, గ్రాండ్‌ మాస్టర్లతోపాటు ఉద్దండులు ఆర్తుర్‌ యూసుపోవ్‌ (రష్యా), అలెక్సీ షిరోవ్‌ (స్పెయిన్‌) వద్ద శిక్షణ పొందుతోంది.

మీనాక్షి ఏడేళ్ల ప్రాయంలోని చెస్‌ బోర్డుపై అద్భుతాలు సృష్టించింది. 2018లో వుమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ టైటిల్‌ను పూర్తిచేసిన మీనాక్షి....ఈ ఏడాది మే నెలలో ఫిడే రేటింగ్‌ ప్రకారం అండర్‌-11 బాలికల కేటగిరీలో వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచింది. అలాగే గత ఏడాది జరిగిన జాతీయ అండర్‌-10 బాలికల చెస్‌ టోర్నీలో చాంపియన్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. కాగా అనేక అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో పతకాలు సాధించిన మీనాక్షి తాజాగా ఫిడే మాస్టర్‌ టైటిల్‌ సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-07T01:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising