ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Darshit: చిన్నారి దర్శిత్‌ ఇక లేడు

ABN, First Publish Date - 2022-11-26T02:35:03+05:30

తమ బిడ్డకు కరెంట్‌ షాక్‌ తగలడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇన్ఫెక్షన్‌ పెరగడంతో వైద్యులు రెండు కాళ్లూ తొలగించారు. .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల విద్యుత్‌షాక్‌కు గురైన మూడేళ్ల చిన్నారి

ఇన్ఫెక్షన్‌తో 2 కాళ్లూ తొలగింపు

చివరికి కార్డియాక్‌ అరె్‌స్టతో మృతి

ప్రభుత్వం నుంచి స్పందన లేకే

చనిపోయాడని తల్లిదండ్రుల రోదన

కాకినాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తమ బిడ్డకు కరెంట్‌ షాక్‌ తగలడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇన్ఫెక్షన్‌ పెరగడంతో వైద్యులు రెండు కాళ్లూ తొలగించారు. ఇక తమ కొడుకు ఇక నడవలేడని తెలిసినా.. ప్రాణాలతో బయటపడితే చాలు.. కన్నపేగును జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకున్నారు. కానీ ఇంతలోనే విధి వక్రించి చిన్నారి దర్శిత్‌ మృత్యువొడికి చేరుకోవడం అందరినీ కన్నీరుపెట్టించింది. దర్శిత్‌ తల్లిదండ్రుల పుత్రశోకానికి అంతులేకుండా పోయింది. వివరాలివీ.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం పైడి మెట్టకు చెందిన చాందిని అనే గృహిణి ఈనెల 12న తన ఇంటి మేడపై దుస్తులు ఆరేయడానికి తన రెండో కొడుకు దర్శిత్‌(3)తో వెళ్లింది. దర్శిత్‌ ఆడుకుంటూ పక్కనే ఉన్న 33కేవీ విద్యుత్‌ వైర్లకు సమీపంగా వెళ్లడంతో కరెంట్‌షాక్‌ తగిలింది. కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉండడంతో తల్లిదండ్రుల సమ్మతితో రెండు కాళ్లూ తొలగించారు. చేతులకూ శస్త్రచికిత్స చేశారు. పరీక్షల్లో దర్శిత్‌ తలవెనుక భాగంతోపాటు శరీరంలో అనేక అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో జీజీహెచ్‌లో ఆర్‌ఐసీయూకి తరలించారు. అప్పటికే గుండె పనితీరు కూడా బాగా మందగించింది. దర్శిత్‌ను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా శరీరం సహకరించలేదు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవడంతో తప్పనిపరిస్థితుల్లో మోకాళ్లవరకు రెండు కాళ్లూ తొలగించారు. శుక్రవారం సాయం త్రం ఐదుగంటలకు దర్శిత్‌కు కార్డియాక్‌ అరె్‌స్టతో కన్నుమూసినట్లు జీజీహెచ్‌ వైద్యులు ప్రకటించారు.

అప్పుడే స్పందించి ఉంటే...

తమ ఇంటిపై ప్రమాదకరంగా వేలాడుతున్న 33కేవీ విద్యుత్‌ లైన్లు తొలగించాలంటూ దర్శిత్‌ తల్లిదండ్రులు మూడునెలల కిందట కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి వనిత ఆ ప్రాంతానికి గడపగడప కార్యక్రమానికి వెళ్లగా విజ్ఞప్తి చేశారు. కానీ, ఎవరూ పట్టిం చుకోలేదు. ఈనెల 12న దర్శిత్‌కు విద్యుత్‌షాక్‌ తగిలిన తర్వాత ట్రాన్స్‌కో అధికారులు అక్కడికి వచ్చి వేలాడుతున్న విద్యుత్‌ తీగల ఎత్తు పెంచుతామని చెప్పారు. ఆ పని కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో.. చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించడానికి హోంమంత్రి వనిత శుక్రవారం మధ్యాహ్నం జీజీహెచ్‌కు రాగా దర్శిత్‌ తల్లిదండ్రులు ఆమె కాళ్లపై పడి కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డను ఎలాగైనా బతికించాలంటూ రోదించారు. ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని విలపించారు. ప్రభుత్వంతో మాట్లాడతానంటూ వనిత పేర్కొన్నారు.

కానీ సాయంత్రానికే దర్శిత్‌ అనంతలోకానికి వెళ్లిపోయాడు. హోంమంత్రి ముం దే స్పందించి విద్యుత్‌ తీగ లు ఎత్తు పెంచాలని ఆదేశించి ఉంటే ఈ పరిస్థితి వచ్చే ది కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంతూ దర్శిత్‌ తల్లిదండ్రులు జొన్నకూటి వినోద్‌, చాందిని కన్నీరుమున్నారయ్యారు. మరోపక్క రెండుకాళ్లూ కోల్పోయిన తమ బిడ్డను జీవితాంతం చూసుకునేందుకు వీలుగా తమకో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని దర్శిత్‌ తండ్రి ఇటీవల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేదు. దర్శిత్‌ అనారోగ్య పరిస్థితిపై ఈనెల 18న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. ఆ తర్వాత సామాజి క మాధ్యమాల్లో అతడి పరిస్థితి వైరల్‌ అయ్యింది. దీని పై స్పందించిన అనేకమంది దాతలు దర్శిత్‌ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఆ చిన్నారి కోలుకోవాలని ఆకాంక్షించారు. అ యి నా.. ఆ చిన్నారి మృత్యువును జయించలేకపోయాడు.

Updated Date - 2022-11-26T09:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising