ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దేరు జలాశయం గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2022-08-04T06:50:41+05:30

పెద్దేరు జలాశయం నుంచి 512 క్యూసెక్కుల నీటిని జలాశయం అధికారులు విడిచిపెట్టారు.

పెద్దేరు జలాశయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

512 క్యూసెక్కుల నీరు దిగువకు..

మాడుగుల రూరల్‌, ఆగస్టు 3: పెద్దేరు జలాశయం నుంచి 512 క్యూసెక్కుల నీటిని జలాశయం అధికారులు విడిచిపెట్టారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు. మంగళవారం రాత్రి 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో జలాశయం నీటిమట్టం 136.60 మీటర్లకు చేరింది. గరిష్ఠ నీటిమట్టానికి చేరువవుతున్న తరుణంలో జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి దాటిన తరువాత  మూడో నంబరు గేటు ఎత్తి తొలుత 200 క్యూసెక్కులు, తరువాత మరో 312 క్యూసెక్కులు.. మొత్తంగా 512 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. బుధవారం ఉదయం ఆరుగంటలకు గేటును మూసేశారు. బుధవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 120 క్యూసెక్కులు వస్తోందని, 136.30 మీటర్లకు చేరిందని జలాశయం ఏఈ సుధాకర్‌ రెడ్డి తెలిపారు.


నేడు పంట కాలువలకు నీరు విడుదల

పెద్దేరు జలాశయం ప్రధాన కుడి, ఎడమ(రాచకట్టు) కాలువలకు గురువారం నీటిని విడిచిపెడుతున్నామని ఏఈ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కాలువల కింద ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు వరినాట్ల పనులు అవుతున్న క్రమంలో స్పిల్‌వే ద్వారా నీటిని విడిచిపెడతామన్నారు. రెండు కాలువలకు చెరొక 40 క్యూసెక్కుల నీరు విడిచిపెడతామని తెలిపారు.

Updated Date - 2022-08-04T06:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising