ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విమ్స్‌లో కొవాక్సిన్‌ డ్రాప్స్‌

ABN, First Publish Date - 2022-04-24T05:51:55+05:30

కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ముక్కుద్వారా వేసే కొవాక్సిన్‌ డ్రాప్స్‌ కార్యక్రమాన్ని (నాసల్‌ ఇంట్రామస్కులర్‌ వ్యాక్సిన్‌) మూడో దశ ట్రైల్‌ను రాష్ట్రంలో తొలిసారి విమ్స్‌లో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించా రు.

ట్రయిల్‌ రన్‌ ప్రారంభిస్తున్న డైరెక్టర్‌ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఔత్సాహికులకు వేసి ట్రయిల్‌ రన్‌ ప్రారంభించి డైరెక్టర్‌ రాంబాబు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23: కొవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా ముక్కుద్వారా వేసే కొవాక్సిన్‌ డ్రాప్స్‌ కార్యక్రమాన్ని (నాసల్‌ ఇంట్రామస్కులర్‌ వ్యాక్సిన్‌) మూడో దశ ట్రైల్‌ను రాష్ట్రంలో తొలిసారి విమ్స్‌లో శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించా రు. విమ్స్‌ డైరెక్టర్‌ కె.రాంబాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ సాధారణ వ్యాక్సినేషన్‌తో పోల్చుకుంటే ఈ నాసిల్‌ ఇంట్రామస్క్‌లర్‌ వ్యాక్సిన్‌ మెరుగైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు. ఈ పరిశోధనలకు ఇప్పటి వరకు 39 మంది వలంటీర్లు ముందుకు వచ్చారని, తొలిరోజు నలుగురు వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు.


దేశవ్యాప్తంగా మూడో దశ ట్రైల్‌ 3,160 మందిపై జరుగుతోందని తెలిపారు. మొదటి రెండు దశలు మెరుగైన ఫలి తాలు ఇచ్చాయని, వ్యాక్సినేషన్‌ చేసిన వారిలో యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవ్వడంతోపాటు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవన్నారు. డ్రాప్స్‌ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలనుకునే వారు 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఇంతకు ముందు వ్యాక్సిన్‌ తీసుకోని వారై ఉండాలని తెలిపారు. ఔత్సాహి కులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఐదు నెలలపాటు ట్రైల్‌ కొనసాగిన తర్వాత నివేదిక అందిస్తామని చెప్పారు. ఈ ట్రైల్స్‌ ప్రధాన పరిశోధకుడిగా డాక్టర్‌ రాంబాబు, సహాయ పరిశోధకుడిగా విజయకుమార్‌, సభ్యులుగా డాక్టర్‌ ఊర్మిల, డాక్టర్‌ సహీనా వ్యవహరిస్తున్నారు.  

Updated Date - 2022-04-24T05:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising