ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలిన రామాలయ మండపం

ABN, First Publish Date - 2022-09-25T07:00:49+05:30

జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెం శివారు జాజులవానిపాలెంలోని రామాలయ మండపం శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తప్పిన పెను ప్రమాదం

- జాజులవానిపాలెంలో ఘటన

పరవాడ, సెప్టెంబరు 24: జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెం శివారు జాజులవానిపాలెంలోని రామాలయ మండపం శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జీవీఎంసీలో విలీనం కాకముందు 30 ఏళ్ల క్రితం పంచాయతీ నిధులతో మండపాన్ని నిర్మించారు. మూడేళ్ల క్రితం అది శిథిలావస్థకు చేరుకుంది. మండపం పిల్లర్లు దెబ్బతినడంతో పాటు ఇనుప చువ్వలు బయటకి వచ్చేశాయి. శ్లాబ్‌ నుంచి రోజూ పెచ్చులూడి పడేవి. దీంతో మండపాన్ని కూల్చివేయాలంటూ స్థానికులు జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు స్పందించలేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందేవారు. అయితే మండపం కింద యువకులు, పెద్దలు కూర్చొని సేదతీరేవారు. అదృష్ణవశాత్తూ అర్ధరాత్రి సమయంలో మండపం కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఆ శిథిలాలను వెంటనే తొలగించాలని అధికారులనుగ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-25T07:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising