ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపు అన్యాయం

ABN, First Publish Date - 2022-10-01T06:15:00+05:30

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు అన్నారు.

రిలే దీక్షలో పాల్గొన్న ఈశ్వరి, నాగరాజు, ప్రసాద్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు

మూడో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

పాడేరు రూరల్‌, సెప్టెంబరు 30: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించడం అన్యాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నాయి. జీకే వీధి మండల నాయకులతో కలిసి గిడ్డి ఈశ్వరి, బొర్రా నాగరాజు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి చేసిన అభివృద్ధి లేకపోయినా అరాచకాలు మాత్రం అధికమవుతున్నాయన్నారు. వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో టీడీపీ హయాంలో పెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా తొలగించడమే జగన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి అని విమర్శించారు. జగన్‌ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. జగన్‌తీరుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కక్కలేక, మింగలేక కాలం గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో జీసీసీ మాజీ చైర్మన్‌, దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడు ఎంవీవీ.ప్రసాద్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమెలి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి గబ్బాడ సింహాచలం, టీడీపీ నాయకులు కొట్టగుళ్లి సుబ్బారావు, గంగపూజారి వివకుమార్‌, బుద్ద జ్యోతికిరణ్‌, అల్లంగి సుబ్బలక్ష్మి, డీవీ.కుమారి, బి.వరలక్ష్మి, కిముడు సింహాచలం, జీకేవీధి మండల ముఖ్యనాయకులు ముక్కల రమేష్‌, గంట నళిని, జి.బుజ్జిబాబు, కె.భీంబాబు, పి.భీంబాబు, కె.కొండబాబు, వి.వెంకటరమణ, పి.సత్యారావు, ముక్కల మహేష్‌, రామకృష్ణ, పాండురాజు, నాగేశ్వరరావు, సురేష్‌, వెంకటరమణ, శ్రీను, నీలకంఠం, బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T06:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising