ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్రాణ సమాజాన్ని మేధావులు మేల్కొలపాలి

ABN, First Publish Date - 2022-07-03T05:18:48+05:30

నిద్రాణ సమాజాన్ని మేధావులు, ముఖ్యంగా న్యాయవాదులు మేల్కొలపాలని రిటైర్ట్‌ జిల్లా జడ్జి వి.జయసూర్య పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న రిటైర్డు జిల్లా జడ్జి వి.జయసూర్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిటైర్ట్‌  జిల్లా జడ్జి వి.జయసూర్య

సీతంపేట, జులై 2: నిద్రాణ సమాజాన్ని మేధావులు, ముఖ్యంగా న్యాయవాదులు మేల్కొలపాలని రిటైర్ట్‌  జిల్లా జడ్జి వి.జయసూర్య పిలుపునిచ్చారు. రామాటాకీస్‌ రోడ్డు ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రి ఎదురుగా గల అంబేడ్కర్‌ భవన్‌లో న్యాయవాదులు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ‘అంబేడ్కర్‌ ఆశయాలు, రాజ్యాధికార పరంపర, న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన జయసూర్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాజకీయంగా అణగదొక్కుతున్న క్రమంలో అందరూ జాగృతమై చైతన్య స్ఫూర్తితో నిలదీయడానికి ఇదే సరైన తరుణమని, ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కలల సాకార రాజ్యధికార సిద్ధికి న్యాయవాదులు, మేధావులు, మానవతావాదులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  న్యాయవాది బైపా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాజకీయ అధికారం లేని ఏ పదవులు కూడా బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు టి.గోపాలరావు, జి.వెంకన్న, రిటైర్డ్‌ ఐపీఓఎస్‌  అధికారి డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, న్యాయవాదులు జి.జయప్రకాష్‌ బాబు, డి.వెంకట రామకృష్ణ, సీహెచ్‌.రాంబాబు, ఐఎం అహ్మద్‌లు పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం అతిథులను శాలువతో నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కదిరి రాము, కేవీఎన్‌ శశికళ, పైలా శ్రీనివాసరావు, ఎస్‌.మురళీకృష్ణ, జి.సుబ్బారావు, టి.బోసుబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T05:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising