డ్వాక్రా సంఘాలకు రుణ పరిమితి పెంపు
ABN, First Publish Date - 2022-11-03T00:57:15+05:30
వ్యవసాయదారులకు పంట రుణాలను రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచామని డీసీసీబీ చైర్‌పర్సన్ చింతకాలయ అనిత తెలిపారు.
అనకాపల్లి అర్బన్, నవంబరు 2: వ్యవసాయదారులకు పంట రుణాలను రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచామని డీసీసీబీ చైర్‌పర్సన్ చింతకాలయ అనిత తెలిపారు. బ్యాంకు 63వ వార్షికోత్సవాన్ని బుధవారం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాలను కూడా రూ.10 లక్షలు నుంచి రూ.20 లక్షలకు పెంచామన్నారు. సహకార సంఘాల్లో రుణాలు వాడుకుంటున్న రైతులకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు ప్రమాద బీమా పెంచామని చెప్పారు. బ్యాంకు సీఈవో డీవీఎస్ వర్మ మాట్లాడుతూ డీసీసీబీ ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నామన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు రుణాలను చైర్‌పర్సన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు, బ్యాంకు జనరల్ మేనేజర్ బొడ్డేటి శ్రీనివాసరావు, ఏజీఎం ఎన్.శ్రీనివాసరావు, బ్రాంచి మేనేజర్ ఎం.రజనీ, అసిస్టెంట్ మేనేజర్ లలిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-03T00:57:18+05:30 IST