ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిథిల భవనంలో.. భయం భయంగా విధులు!

ABN, First Publish Date - 2022-05-20T06:28:46+05:30

ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయ భవనం శిథి లావస్థకు చేరుకుంది. 1951లో ఈ భవనాన్ని నిర్మించినప్పటికీ నాటి నుంచి నిర్వహణను పట్టిం చుకోక పోవడంతో భవనం ఎక్కడిక క్కడ పెచ్చులూడి పడుతోంది. దీంతో ఇటు సిబ్బందికి, అటు వివిధ పను లపై వచ్చే ప్రజలకు అవస్థలు తప్ప డం లేదు.

శిఽథిలావస్థకు చేరిన తహసీల్దార్‌ కార్యాలయ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెచ్చులూడి పడుతున్న తహసీల్దార్‌ కార్యాలయం శ్లాబ్‌ 

 వర్షాలకు కారుతున్న భవనాలు 

 తడుస్తున్న రికార్డులు 

 అవస్థలు పడుతున్న సిబ్బంది 

రోలుగుంట, మే 19 : ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయ భవనం శిథి లావస్థకు చేరుకుంది. 1951లో ఈ భవనాన్ని నిర్మించినప్పటికీ నాటి నుంచి నిర్వహణను పట్టిం చుకోక పోవడంతో భవనం ఎక్కడిక క్కడ పెచ్చులూడి పడుతోంది. దీంతో ఇటు సిబ్బందికి, అటు వివిధ పను లపై వచ్చే ప్రజలకు అవస్థలు తప్ప డం లేదు. గతంలో ఈ భవనం దుస్థి తికి కలెక్టర్‌ కార్యాలయానికి నివేదించినా పట్టించుకునే వారు కరువయ్యారు. 

వర్షాకాలంలో సిబ్బందికి ఇబ్బంది 

వర్షాకాలం వస్తే కార్యాలయంలో దుస్థితి దారుణంగా ఉంటుంది. ఆ సమయంలో విధుల నిర్వహణ కష్టమే. ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్‌ గది,  కంప్యూటర్‌, రెవెన్యూ సిబ్బంది ఉండే గది, సర్వేయర్‌ గది, ఆర్‌ఐ గది అస్తవ్యస్తంగా మారాయి. ఇక రికార్డులు భద్రపరిచే గది పరిస్థితి చెప్ప నక్కర్లేదు. వర్షాలకు కారిపోతుండ డంతో రికార్డులు తడిసిపోతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. వర్షాలు వెలి సిన తరువాత సిబ్బంది సదరు రికా ర్డులను ఎండలో ఆరబెట్టిన సం దర్భాలూ ఉన్నాయి. 

పెచ్చులూడి పడుతున్న శ్లాబ్‌లు

ఇదిలావుంటే, కార్యాలయ భవనాల శ్లాబ్‌లు బీటలు వారడంతో పెచ్చు లూడి పతుడున్నాయి. దీంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వహిం చాల్సి వస్తోంది. గతంలో హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయాల్లో భవనం ఎక్కడ కూలిపోతుందోనని భయపడినట్టు సిబ్బంది చెపుతున్నారు. ముఖ్యంగా రికార్డు గది పూర్తిగా శిథిలమైంది. ఆ గదిలో 21 పంచాయితీలకు సంబంధించిన దస్త్రాలను భద్రపరిచారు. పాత అడంగళ్‌, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి దస్త్రాలు ఇం దులోనే ఉన్నాయి.  వర్షాల సమ యాల్లో అవి నానిపోతు న్నాయని సిబ్బంది వాపోతున్నారు. 

Updated Date - 2022-05-20T06:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising