ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు ఆపాలి

ABN, First Publish Date - 2022-07-02T06:21:03+05:30

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను అపాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు వాత్సవాయి శ్రీలక్ష్మి డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  యూటీఎఫ్‌  జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి 

అచ్యుతాపురం, జూలై 1 : ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను అపాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు వాత్సవాయి శ్రీలక్ష్మి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల అనంతరం బదిలీలు ఉంటాయని ఒక వైపు చెపుతున్న ప్రభుత్వం, సాధారణ బదిలీలకన్నా ముందుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ నాయకుల సిఫార్సు లేఖల ద్వారా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను చేపట్టేందుకు  చర్యలు చేపట్టడం సరైన విధానం కాదన్నారు. బదిలీలను సక్రమ పద్ధతిలో నిర్వహించి గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్‌ సమాంతర మీడియాం కొనసాగాంచాలన్నారు. మూడు నుంచి ఐదు తరగతుల ఉన్నత పాఠశాలల్లో విలీనాన్ని విరమించుకోవాలని పేర్కొ న్నారు.  ఇటీవల విడుదల చేసిన జీవో 117ను వెంటనే రద్దుచేయాలని ఆమె కోరారు .యూనియన్‌ ప్రతినిధులు ఎస్‌.నూకరాజు, ఎన్‌.శ్రీనివాసరాజు. ఎం.సూర్యలక్ష్మి, కె.మహిమారావు, కె.ప్రేమానందం  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T06:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising