ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవగాహన లేని మంత్రి బొత్స రాజీనామా చేయాలి

ABN, First Publish Date - 2022-11-21T00:51:56+05:30

అవగాహన లేని మంత్రి బొత్స రాజీనామా చేయాలి......

సమావేశంలో మాట్లాడుతున్న జగదీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌

అనకాపల్లి అర్బన్‌, నవంబరు 20 : ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని ప్రకటించిన విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు భిన్నంగా విద్యా సంవత్సరం మధ్యలో బదిలీల ప్రక్రియ ప్రారంభించడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. అంతేకాకుండా బదిలీల అంశంలోనూ రోజుకో నిబంధనలు పెట్టి, సదరు ఫైల్‌ను పక్కన పెట్టడం అన్యాయమన్నారు. అవగాహన లేని ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో బుద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన జగన్‌రెడ్డి, ఇప్పుడు సాధ్యం కాదని అవగాహన లేక ప్రకటన చేశామని పేర్కొనడం దారుణమన్నారు. అంతేకాకుండా ఎన్నికల ముందు ఉద్యోగస్తులకు పెండింగ్‌ డీఏలు ఇస్తామని హామీ ఇచ్చి, తీరా ఎన్నికలయ్యాక నరకం చూపిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ పీఆర్సీ బకాయిలు విడుదల చేయకపోవడం, పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. ఐఆర్‌ ప్రకటించి నాలుగుశాతం ఉద్యోగులకు నామం పెట్టిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిగా పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-21T00:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising