ఇదేం ఖర్మ రాష్ట్రానికి
ABN, First Publish Date - 2022-12-16T00:46:11+05:30
అబద్ధాలతో జనాన్ని నమ్మించి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత అన్ని వర్గాలవారిని మోసం చేసిన జగన్మోహన్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన నర్సీపట్నం మండలం కేఎల్‌పురం, మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మోసం చేసి గద్దెనెక్కిన జగన్‌ను చిత్తుగా ఓడించాలి
మాజీ మంత్రి అయ్యన్న పిలుపు
అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం అధోగతి
మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శ
రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం టీడీపీని గెలిపించాలని వినతి
నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలు
నర్సీపట్నం అర్బన్/ మాకవరపాలెం, డిసెంబరు 15: అబద్ధాలతో జనాన్ని నమ్మించి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తరువాత అన్ని వర్గాలవారిని మోసం చేసిన జగన్మోహన్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. గురువారం ఆయన నర్సీపట్నం మండలం కేఎల్‌పురం, మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో అయ్యన్న మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్.. ఈ మూడున్నరేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. గత ఎన్నికల్లో చెల్లి, తల్లితో కలిసి మాయమాటలు చెప్పి, జనానికి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాడని, ఇప్పుడు ఆ చెల్లి, ఆ తల్లి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గత ఏడాది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.1,800 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదని చెప్పారు. జగన్‌రెడ్డి అసమర్థ, అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి, లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని అయ్యన్న ధ్వజమెత్తారు. ఒక్క అవకాశం అంటూ ప్రజలకు మాయమాటలు చెప్పిన జగన్, సీఎం అయిన తర్వాత రాష్ర్టాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు. రాబోయో ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి, చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. లచ్చన్నపాలెంలో పార్టీ నాయకులతో కలసి ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. కేఎల్‌పురంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి లాలం కాశీ, జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు శ్రీరంగస్వామి; లచ్చన్న పాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆర్.వై.పాత్రుడు, నాయకులు అల్లు రామునాయుడు, రుత్తల శేషుకుమార్, పోతల అప్పలనాయుడు, పోతల రాంబాబు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:46:13+05:30 IST