ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల ఆదేశాలు బేఖాతరు

ABN, First Publish Date - 2022-03-16T05:56:53+05:30

స్థానిక రాజుగారిబీడులో పుంతరోడ్డు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించే వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని పంచాయతీ అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పలువురు బేఖాతరు చేస్తు న్నారు.

పుంతరోడ్డు పక్కన జరుగుతున్న ఇంటి నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుంతరోడ్డును ఆనుకుని ఇంటి నిర్మాణం


పాయకరావుపేట, మార్చి 15: స్థానిక రాజుగారిబీడులో పుంతరోడ్డు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించే వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని పంచాయతీ అధికారులు జారీ చేసిన హెచ్చరికలను పలువురు బేఖాతరు చేస్తు న్నారు. యథావిధిగా రోడ్డును ఆనుకుని ఇళ్ల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. పాయకరావుపేట పట్టణంలోని రాజుగారి బీడులో ఆక్రమణలపాలైన సందప్ప చెరువు పుంతరోడ్డు సర్వే పూర్తయి, హద్దులు నిర్ణయించేంత వరకు పనులు నిలిపివేయాలని గతేడాది నవంబరులో పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. దీంతో పలువురు ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇటీవల పుంతరోడ్డు సర్వే పూర్తిచేసిన రెవెన్యూ అధికారులు రోడ్డుకి ఇరువైపులా పలుచోట్ల ఆక్రమణలు జరిగినట్టు గుర్తించారు. సర్వే నివేదిక ఆధారంగా పుంతరోడ్డుకి ఇరువైపులా సరిహద్దురాళ్లను ఏర్పాటుచేసి ఆక్రమణలు తొలగించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలి. అంతవరకు పుంతరోడ్డును ఆనుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కానీ మెయిన్‌ జంక్షన్‌లో ఇంటి నిర్మాణం జరుగుతోంది. పైగా ఈ ఇంటి నిర్మాణానికి పంచాయతీ ప్లాన్‌ అప్రూవల్‌ లేదని తెలిసింది. దీనిపై పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యప్రసాద్‌ని వివరణ కోరగా, వెంటనే సిబ్బందిని పంపి నిర్మాణ పనులు నిలిపివేయిస్తామని తెలిపారు.






Updated Date - 2022-03-16T05:56:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising