ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కూలీలపై తేనె టీగల దాడి

ABN, First Publish Date - 2022-05-27T06:04:46+05:30

జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలపై అకస్మాత్తుగా తేనె టీగలు దాడి చేయడంతో 20 మందికి గాయాలయ్యాయి.

ముంచంగిపుట్టు ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న బాధిత గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 20 మందికి గాయాలు

ముంచంగిపుట్టు, మే 26: జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలపై అకస్మాత్తుగా తేనె టీగలు దాడి చేయడంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో మారుమూల బరడ పంచాయతీ హంసబంద గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... హంసబంద గ్రామంలో 45 మంది గిరిజనులు గ్రామానికి సమీపంలో ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి సమీపంలోని అడవులోంచి అకస్మాత్తుగా తేనె టీగల గంపు వచ్చి వారిపై దాడి చేశాయి. పనులు చేస్తున్న కూలీలు పని ముట్లను వదిలేసి పరుగులు తీశారు. కొందరు సమీపంలోని కొండలు ఎక్కగా, మరికొందరు గ్రామంలోకి పారిపోయారు. అయినప్పటికీ విజయ, మల్లన్న, శుక్ర, భగత్రామ్‌, నాగమణి, పార్వతమ్మ, సురేశ్‌, ధనుంజయ్‌లతోపాటు మరో 12 మంది తేనె టీగల దాడిలో గాయాలపాలయయ్యారు. వారిని హుటాహుటిన 108, ఇతర వాహనాల్లో ముంచంగిపుట్టు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్‌ జ్ఞానేశ్వరి, సిబ్బంది బాధిత గిరిజనులకు వైద్య సేవలందించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్‌ తెలపడంతో బాధితుల కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. 


Updated Date - 2022-05-27T06:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising