ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమారుడిని కాపాడి.. తాను బలయ్యాడు

ABN, First Publish Date - 2022-10-17T07:00:58+05:30

విద్యుదాఘాతానికి గురైన కుమారుడిని రక్షించబోయి... తాను ప్రాణాలు కోల్పోయాడు ఓ తండ్రి. మండలంలోని నీలకంఠాపురంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు...

విద్యుదాఘాతానికి బలైన సురేష్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుదాఘాతానికి గురైన బాలుడు

కొడుకుని రక్షించేందుకు తువ్వాలుతో వైరుని పట్టుకున్న తండ్రి

కరెంట్‌ షాక్‌తో తీవ్రగాయాలు

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

ప్రాణాలతో బయటపడిన బాలుడు

బుచ్చెయ్యపేట, అక్టోబరు 16: విద్యుదాఘాతానికి గురైన కుమారుడిని రక్షించబోయి... తాను ప్రాణాలు కోల్పోయాడు ఓ తండ్రి. మండలంలోని నీలకంఠాపురంలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు... 

బుచ్చెయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామానికి 

చెందిన పడాల సురేష్‌ (38) ఇటీవల నూతన ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఆదివారం స్కూల్‌కి సెలవు కావడంతో కుమారుడు తరుణ్‌తేజ్‌ తండ్రికి సాయం చేద్దామని నూతన ఇంటి వద్దకు బయలుదేరాడు. సమీపంలోకి వచ్చే సరికి దారిలో తెగిపడి ఉన్న ఇంటి సర్వీసు వైరు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై పెద్దగా కేకలు వేశారు. సమీపంలో ఇంటి నిర్మాణ పనుల్లో ఉన్న తండ్రి సురేష్‌ పరుగున తరుణ్‌తేజ్‌ వద్దకు వచ్చాడు. కుమారుడిని రక్షించేందుకు తువ్వాలును చేతికి చుట్టుకుని వైర్‌ను తీసేసి తరుణ్‌తేజ్‌ను పక్కకు నెట్టేశాడు. ఈ క్రమంలో సురేష్‌ 

విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా  గాయపడ్డాడు.  తరుణ్‌తేజ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. గాయపడిన సురేష్‌ను అనకాపల్లి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. సరేష్‌ మృతితో భార్య నాగమణి, కుమారుడు తరుణ్‌తేజ్‌, కుమార్తె వీణమాధవి, తల్లి వరహాలమ్మ కన్నీరుమున్నీరు అయ్యారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - 2022-10-17T07:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising