జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
ABN, First Publish Date - 2022-03-05T06:25:27+05:30
జీవీఎంసీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు.
సిరిపురం, మార్చి 4: జీవీఎంసీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు రూ.15 వేల పీఆర్సీ బదులు రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్స్లో జరిగిన అన్యాయాన్ని ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, సరిదిద్ది డీఏతో కలిపి బేసిక్ రూ.20 వేలు అమలు చేయాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 8, 9, 10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, మానవహారాలు చేస్తామని, అనంతరం 11న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, అధ్యక్షుడు జి.సుబ్బారావు, సభ్యులు ఎం.వరప్రసాద్, టి.నూకరాజు, యు.రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T06:25:27+05:30 IST