ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతను మోసగిస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2022-07-02T06:30:11+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర, నెక్కి లెనిన్‌బాబు పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర, నెక్కి లెనిన్‌బాబు


కొత్తూరు, జూలై 1 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న యువజన వ్యతిరేక విధానాలపై యువత పోరాడాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర, నెక్కి లెనిన్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో   మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసగించే పనిలో ఉన్నాయన్నారు. అదే కోవలో రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పయనిస్తూ సచివాలయ ఉద్యోగులతోనే పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. వీటన్నింటిపై రానున్న ఎన్నికల్లో యువత తగిన గుణం పాఠం చెప్పాలన్నారు. ఏఐవైఎఫ్‌ నాయకులు, జిల్లా సీపీఐ కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ,  సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఐవైఎఫ్‌ అనకాపల్లి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా వేముల కన్నబాబు, వియ్యపు రాజు, ఉపాధ్యక్షుడిగా డొక్కరి హరీష్‌, సహాయ కార్యదర్శిగా నాగమణి, కోశాధికారిగా కనకరాజులతో పాటు మరికొందరిని సభ్యులుగా ఎన్నుకున్నారు.


Updated Date - 2022-07-02T06:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising