ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN, First Publish Date - 2022-09-26T06:43:25+05:30

కాపు సామాజికవర్గం అభ్యు న్నతికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని కాపు కార్పొరేషన్‌ చైర్మ న్‌ అడపా శేషు అన్నా రు.

దిశ పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలిస్తున్న అడపా శేషు, ముత్తంశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు

విశాఖ నగరంలో కాపు భవనం స్థలం పరిశీలన

విశాఖపట్నం, సెప్టెంబరు 25 : కాపు సామాజికవర్గం అభ్యు న్నతికి రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తోందని కాపు కార్పొరేషన్‌ చైర్మ న్‌ అడపా శేషు అన్నారు. కాపు సామాజి క వర్గంలో అత్య ధిక శాతం వెనుకబడి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ఎక్కువ మంది లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. 8వ వార్డు దిశ పోలీస్‌ స్టేషన్‌ పక్కన కాపు భవనానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం సాయంత్రం పరిశీలించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన 50 సెంట్ల స్థలంలో రూ.2 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. తిరుపతి, విజయవాడ, నెల్లురులోను త్వరలో కాపు భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపు భవనం కోసం రూ.30 కోట్ల విలువైన స్థలం కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట బీసీ కార్పొరేషన్‌ ఈడీ ప్రసాద్‌, రూరల్‌ తహసీల్దార్‌ పాల్‌కిరణ్‌, కార్పొరేటర్‌ నొడగల అప్పారావు, వైసీపీ నాయకులు అల్లాడ ఉమామహేశ్వరరావు, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-26T06:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising