ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో బెల్లం లావాదేవీలు నిలిపివేత

ABN, First Publish Date - 2022-05-19T06:29:27+05:30

నాటుసారా తయారీకి నల్ల బెల్లమే కారణమంటూ బెల్లం వ్యాపారులపై పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో గురువారం బెల్లం లావాదేవీలను రద్దు చేశారు.

మార్కెట్‌ యార్డులో బెల్లం దిమ్మలు (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల దాడులపై వ్యాపారుల నిరసన

నల్లబెల్లం అమ్మకాలపై నియంత్రణ సరికాదని ఆవేదన


అనకాపల్లిటౌన్‌, మే 18: నాటుసారా తయారీకి నల్ల బెల్లమే కారణమంటూ బెల్లం వ్యాపారులపై పోలీసులు,  ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో గురువారం బెల్లం లావాదేవీలను రద్దు చేశారు. కలెక్టర్‌తో జరిగే చర్చల్లో వ్యాపారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటే ఒక్క రోజు మాత్రమే బెల్లం లావాదేవీలను నిలిపివేస్తామని, లేదంటే లావాదేవీల నిలిపివేత కొనసాగుతుందని వర్తకసంఘం కార్యదర్శి కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) తెలిపారు.

నాటుసారా తయారీకి ముడిసరుకుగా వినియోగిస్తున్న నల్లబెల్లం విక్రయాలపై పోలీసు నిఘా ఉంటుందని ఇటీవల జరిగిన పత్రికా సమావేశంలో డీఐజీ హరికృష్ణ స్పష్టం చేశారు. నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం విక్రయించిన వ్యాపారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గౌతమిశాలి హెచ్చరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా తయారీ విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. నాటుసారా తయారీకి నల్లబెల్లమే కారణమంటూ వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని చిత్తూరు, రాజమహేంద్రవరం, నిడదవోలు తదితర మార్కెట్‌ యార్డుల్లో బెల్లం లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

అనకాపల్లి మార్కెట్‌ యార్డుకు వచ్చే బెల్లం చాలా వరకు బిహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. దీనిలో మొదటి, రెండో రకంతోపాటు నల్లబెల్లం (మూడో రకం) కూడా వుంటుంది. ఏపీలోని పలు జిల్లాలకు అనకాపల్లి బెల్లం సరఫరా అవుతున్నప్పటికీ దీనిలో నల్లబెల్లం మాత్రం వుండదని వ్యాపారులు చెబుతున్నారు.  నాటుసారాను నియంత్రించకుండా నల్లబెల్లం అమ్మకాలపై నియంత్రణ విధించడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు అంటున్నారు. జిల్లా కలెక్టర్‌తో వర్తకులు సమావేశమవుతారని, సానుకూల స్పందన వస్తే బెల్లం లావాదేవీలు యఽథావిధిగా కొనసాగుతాయని, లేకుంటే కొంతకాలంపాటు లావాదేవీలు నిలిపివేయక తప్పదని వర్తకులు చెబుతున్నారు. 


Updated Date - 2022-05-19T06:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising