ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ ధర మళ్లీ పెంపు

ABN, First Publish Date - 2022-05-20T06:23:38+05:30

సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండపై రూ.3 భారం

మూడు జిల్లాల్లో వినియోగదారులపై నెలకు రూ.21 లక్షల అదనపు భారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని చమురు కంపెనీలు ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా ఎప్పుడంటే అప్పుడు రేట్లు పెంచేస్తున్నాయి. వంట గ్యాస్‌ ధరలను పదిహేను రోజులకు ఒకసారి...1వ తేదీ, 15వ తేదీన మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సవరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతిరోజూ ఎలాగైతే మారుస్తున్నారో...గ్యాస్‌ ధరను కూడా దాదాపుగా అలాగే పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ నెల 7వ తేదీన వంటగ్యాస్‌ 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను రూ.50 పెంచారు. దాంతో రేటు రూ.958 నుంచి రూ.1,008కి చేరింది. ఇప్పుడు మళ్లీ గురువారం ఆకస్మికంగా అదే సిలిండర్‌ ధరను మరో మూడు రూపాయలు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేవలం 12 రోజుల వ్యవధిలో మరోసారి రేటు పెంచింది. దీంతో ఇప్పుడు విశాఖపట్నంలో సిలిండర్‌ ధర రూ.1,011కు చేరింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సుమారుగా 13 లక్షల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చాయి. ఏడు లక్షల మంది  ప్రతి నెలా సిలిండర్‌ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిపై రూ.3 చొప్పున ఏడు లక్షల మందిపై రూ.21 లక్షల అదనపు భారం పడనున్నది. ఈ కొత్త ధరలు గురువారం నుంచే అమలులోకి వచ్చాయి. 


వైసీపీ కార్యాలయానికి  రెండు ఎకరాలు!

33 ఏళ్లకు లీజుపై కేటాయించేందుకు ప్రతిపాదన

జీవీఎంసీ కౌన్సిల్‌ ఎజెండాలో పొందుపరిచిన పెద్దలు

ఎన్‌ఏడీ ఫ్లెఓవర్‌కు వైఎస్‌ఆర్‌ పేరు

63 అంశాలతో అజెండా


విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం కోసం 33 ఏళ్ల లీజుపై రెండు ఎకరాలు కేటాయించేందుకు జీవీఎంసీ పాలకవర్గం సిద్ధమమతోంది. ఇందుకు ఈ నెల 26న జరిగే కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదముద్ర వేయించాలని అధికార పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కౌన్సిల్‌ సమావేశం కోసం 63 అంశాలతో అజెండా తయారుచేశారు. అందులో ప్రధానంగా వైసీపీ కార్యాలయం కోసం స్థలం కేటాయింపు అంశాన్ని పొందుపరిచారు. ఎండాడ సర్వే నంబర్‌ 175/4లో గల రెండెకరాల ప్రభుత్వ భూమిని పార్టీ కార్యాలయ భవనం కోసం 33 ఏళ్లకు లీజుపై కేటాయించాలని ప్రతిపాదించారు. అలాగే టీడీపీ హయాంలో ఎన్‌ఏడీ  జంక్షన్‌లో నిర్మించిన ఫ్లైఓవర్‌కు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా అజెండాలో పొందుపరిచారు. ఇవికాకుండా ఇంకా ఎజెండాలో ముడసర్లోవ రిజర్వాయర్‌ భూముల పరిరక్షణకు రక్షణ గోడ నిర్మాణం, ఉద్యోగుల పదోన్నతులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల పెంపు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి.

Updated Date - 2022-05-20T06:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising