ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్త, ఆస్తి ఆధారిత పన్నులు రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-08-09T06:18:27+05:30

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చెత్త, ఆస్తి ఆధారిత పన్నులు రద్దు చేస్తూ తీర్మా నం చేయాలని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం డిమాండ్‌

విశాఖపట్నం,  ఆగస్టు 8: జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చెత్త, ఆస్తి ఆధారిత పన్నులు రద్దు చేస్తూ  తీర్మా నం చేయాలని సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు డిమాండ్‌ చేశారు. పిఠాపురం కాలనీ సీపీఎం కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పన్నులు విధిస్తోం దన్నారు. ఈ నెల 10న కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా జీవీఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేపడతున్నామన్నారు.


ప్రజలు స్వచ్ఛందంగా ధర్నాలో  పాల్గొని తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ చట్ట విరుద్ధమైన చెత్త పన్ను రద్దు చేయాలని సీపీఎం కోర్టును ఆశ్రయించిందని, ప్రస్తుతం ఇది విచారణలో ఉందన్నారు. ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు మంత్రులను సైతం పన్నుల విషయంలో నిలదీశారన్నారు. అందుకే పన్నులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, కృష్ణారావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising