ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్యాణపులోవ కాలువకు గండి

ABN, First Publish Date - 2022-08-17T05:54:46+05:30

కల్యాణపులోవ రిజర్వాయర్‌ ప్రధాన కాలువకు ములకాలపల్లి సమీపంలో ఆక్విడెక్ట్‌ వద్ద సోమవారం రాత్రి మళ్లీ గండి పడింది.

ఆక్విడెక్ట్‌ వద్ద పడిన గండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నిలిచిన నీటి సరఫరా.. 

గండి త్వరగా పూడ్చాలని రైతులు వినతి

రావికమతం, ఆగస్టు 16: కల్యాణపులోవ రిజర్వాయర్‌ ప్రధాన కాలువకు ములకాలపల్లి సమీపంలో ఆక్విడెక్ట్‌ వద్ద సోమవారం రాత్రి మళ్లీ గండి పడింది. దీంతో ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని నిలిపివేశారు. దీంతో  ఈ కాలువ దిగువన దమ్ములు నిలిచిపోయాయి. గండి పడిన చోట యుద్ధప్రాతిపదికన పూడ్చాలని రైతులు కోరుతు న్నారు. సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరందించే ఈ రిజర్వాయర్‌ ఆయకట్టుకు ఈనెల ఆరున ఎమ్మెల్యే ధర్మశ్రీ చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు పది రోజులపాటు దమ్ములు చేసి, వరినాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో ములకాలపల్లి సమీపంలో ఆక్విడెక్ట్‌ వద్ద గండి పడి నీరు వృథాగా గెడ్డలోకి పోతోంది. దీంతో అధికారులు కాలువ ద్వారా విడుదలయ్యే నీటిని నిలిపి వేశారు. రైతుల అభ్యర్థన మేరకు బుధవారం ఈ గండిని పూడ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గండిని పూడ్చి  ఆయకట్టుకు సాగునీరు అందించడానికి చర్యలు చేపడుతున్నామని ఏఈ సత్యనారాయణదొర తెలిపారు.

Updated Date - 2022-08-17T05:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising