ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గడప గడపకు’ సమస్యల ఏకరువు

ABN, First Publish Date - 2022-05-20T06:28:31+05:30

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మండలంలోని పెదరాంభద్రపురం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు.

ఎమ్మెల్యే బాబూరావుకు సమస్యలు చెప్పుకుంటున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట రూరల్‌, మే 19: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మండలంలోని పెదరాంభద్రపురం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఈ కార్యక్రమాన్ని నిర్వ హించారు. ముందుగానే స్థానిక నాయకులు, వార్డు వలంటీర్లు రూపొందించిన జాబితా ప్రకారం ఇళ్లకు వెళ్లారు. కార్యక్రమం ప్రారంభానికి ముందే రక్షణగా గ్రామంలో ఇద్దరు ఎస్‌ఐలు, 20 మంది స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించి, వారి సమస్యలు తెలుసుకుని అధికారులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పలువురు మహిళలు ఇళ్ల స్థలాలు, గృహాల మంజూరు, పింఛన్లు, అధిక విద్యుత్‌ బిల్లులు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా నాడు- నేడు రెండవ విడతగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు రూ.63 లక్షలు మంజూరైన సందర్భంగా శిలా ఫలకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్‌ పి. అంబేడ్కర్‌, హౌసింగ్‌ ఏఈ శామ్యూల్‌ రాజు, జడ్పీటీసీ లంక సూర్యనారాయణ, వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబురావు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గూటూరు శ్రీనువాసరావు, గారా ప్రసాద్‌, ఇసరపు తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T06:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising