ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పౌర సరఫరాల నకిలీ అధికారి అరెస్టు

ABN, First Publish Date - 2022-05-29T06:28:15+05:30

పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు ఆడంకి చక్రవర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనిఖీల పేరిట మెస్‌లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకుల వద్ద డబ్బులు వసూలు 

మరో నిందితుడు పరారీ


ఎంవీపీ కాలనీ, మే 28: పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్‌ సిలిండర్లకు బదులు డొమెస్టిక్‌ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు. తాను పౌర సరఫరాల శాఖ అధికారినంటూ...అపరాధ రుసుం కింద రూ.పది వేలు చెల్లించాలని చెప్పడంతో ఆ సెంటర్‌ నిర్వాహకుడు లంచం కింద రూ.ఏడు వేలు ఫోన్‌ పే చేశారు. ఇదేవిధంగా చక్రవర్తి, శ్రీనివాస్‌లు ఈ నెల 23న విజయ మెస్‌ నిర్వాహకుడు మల్లవరపు శ్రీనివాసరావును కూడా బెదిరించి డబ్బులు వసూలుచేశారు. శనివారం గోదావరి టిఫిన్‌ సెంటర్‌ వద్ద వారిద్దరినీ చూసిన శ్రీనివాసరావు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని విచారించగా నకిలీ అధికారిగా తేలడంతో చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన శ్రీనివాస్‌ పరారయ్యాడు. చక్రవర్తిపై చీటింగ్‌ కేసు నమోదు చేశామని, పరారీలో మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  


జీవీఎంసీలో అంతర్గత బదిలీలు

మూడేళ్లకు పైబడి ఒకేచోట ఉన్న వారికి స్థానచలనం


సిరిపురం, మే 28: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో అంతర్గత బదిలీలకు కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా నడుంబిగించారు. ఒకే విభాగంలో మూడేళ్లకు పైబడి పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అదనపు కమిషనర్‌ 1 చైర్మన్‌గా, ఇద్దరు అదనపు కమిషనర్లు, డీసీఆర్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ సభ్యులుగా, అడ్మినిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ కన్వీనర్‌గా కమిటీని నియమించారు. ఈ కమిటీ బదిలీల కౌన్సెలింగ్‌కు శ్రీకారం చుట్టింది. శనివారం వరకూ నలుగురు ఆర్‌ఓలు, ఎనిమిది మంది సూపరింటెండెంట్లు, 11 మంది ఆర్‌ఐలు, 24 మంది జూనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేసింది. ఈ ప్రక్రియ సోమవారం కూడా కొనసాగనున్నది.

Updated Date - 2022-05-29T06:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising