ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షణక్షణం.. భయం భయం

ABN, First Publish Date - 2022-10-17T06:55:35+05:30

వరహానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోముదేవుపల్లి వద్ద గట్టు కోతకు గురైంది. గట్టుపై ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం, ఓ పూరిల్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. ఏ క్షణంలోనైనా కూలిపోయే విధంగా ఉన్నాయి.

వరహానది ఉధృతికి సోముదేవుపల్లి వద్ద గట్టు కోతకు గురైన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

ఉధృతంగా ప్రవహిస్తున్న వరహానది

కోతకు గురవుతున్న సోముదేవుపల్లి వద్ద గట్టు 

కొట్టుకుపోయే స్థితిలో నూకాంబిక ఆలయం, పూరిల్లు

మూడేళ్ల క్రితం పరిస్థితి పునరావృతమవుతుందేమోనని భయం

గట్టు కొట్టుకుపోతే సోముదేవుపల్లి, కొత్తసోముదేవుపల్లి గ్రామాలకు ముంపు ముప్పు

భీతిల్లుతున్న గ్రామస్థులు


ఎస్‌.రాయవరం, అక్టోబరు 16: వరహానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సోముదేవుపల్లి వద్ద గట్టు కోతకు గురైంది. గట్టుపై ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం, ఓ పూరిల్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. ఏ క్షణంలోనైనా కూలిపోయే విధంగా ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పరిస్థితి తలెత్తింది. 2019లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని సోముదేవుపల్లి గ్రామంలో గల వరహానది ఉధృతంగా ప్రవహించడంతో సోముదేవుపల్లి, కొత్తసోముదేవుపల్లి గ్రామాలకు చెందిన ప్రధాన రహదారి కొట్టుకు పోయింది. అంతే కాకుండా నది పక్కనే ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయం కూలిపోయి నది గర్భంలో కలిసిపోయింది. ఓ ఇల్లు కూడా కనుమరుగైంది. రెండేళ్ల తరువాత కొట్టుకుపోయిన రోడ్డు స్థానంలో గ్రామస్థులు మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. నూకాంబిక ఆలయాన్ని పునర్నిర్మించుకున్నారు. పక్కన ఓ పూరిల్లు కూడా వెలిసింది. అయితే ఇది జరిగిన నెల రోజులకే మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పరిస్థితి అలాగే ఉంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది ప్రవాహం పెరిగింది. నది గట్టు కోతకు గురవుతోంది. అప్పటిలాగా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చితే నూకాంబిక ఆలయం, పూరిల్లు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఈ గట్టు పూర్తిగా కోతకు 

గురైతే సోముదేవుపల్లి, కొత్తసోముదేవుపల్లి గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆయా గ్రామాల ప్రజలు భీతిల్లుతు న్నారు. ఇక్కడి పరిస్థితిని గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి గట్టు కోతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2022-10-17T06:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising