ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై సభ్యుల ధ్వజం

ABN, First Publish Date - 2022-12-16T23:47:05+05:30

మండలంలోని సమస్యలపై ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సమస్యలపై వారు ఏకరువు పెట్టారు.

సమావేశంలో మాట్లాడుతున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జి.మాడుగుల మండల సమావేశం

జి.మాడుగుల, డిసెంబరు 16: మండలంలోని సమస్యలపై ప్రజా ప్రతినిధులు ధ్వజమెత్తారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సమస్యలపై వారు ఏకరువు పెట్టారు. సమావేశంలో ప్రధాన అంశంగా కొత్తూరు గురుకుల పాఠశాల విద్యార్థి మృతిపై సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే పలు గ్రామాల్లోని సమస్యలపై అధికారులకు ప్రశ్నలు సంధించారు. అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, కొన్ని పాఠశాలల్లో నాడు-నేడు వర్తించక పూరిగుడిసెలు, రేకుల షెడ్లలో పాఠాలు బోధించాల్సిన దుస్థితి దాపురించిందని సమావేశంలో సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైస్‌ ఎంపీపీ-2 కుడుముల సత్యరానాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, దీంతో ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదని తెలిపారు. అలాగే గెమ్మెలి సచివాలయంలో సిబ్బంది తీరుపై మండిపడ్డారు. పనులపై కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కొర్రా పద్మ, జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి, వైస్‌ ఎంపీపీ కల్యాణి, ఎంపీడీవో లోహిత్‌జయసాగర్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising