ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం సేకరణలో రైతులకు లబ్ధి చేకూరాలి

ABN, First Publish Date - 2022-10-08T05:24:19+05:30

ధాన్యం సేకరణలో రైతులకు లబ్ధి చేకూరాలని పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీర పాండ్యన్‌లతో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, లీగల్‌ మెట్రాలజీ, విజిలెన్‌ ్స అండ్‌ మోనటరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఉత్తరాంధ్ర పౌర సరఫరాల శాఖాధికారులతో మాట్లాడుతున్న మంత్రి నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పౌర సరఫరాల శాఖా మంత్రి వెంకట నాగేశ్వరరావు

విశాఖపట్నం, అక్టోబరు 7: ధాన్యం సేకరణలో రైతులకు లబ్ధి చేకూరాలని  పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీర పాండ్యన్‌లతో కలిసి ఉత్తరాంధ్ర జిల్లాల పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, లీగల్‌ మెట్రాలజీ, విజిలెన్‌ ్స అండ్‌ మోనటరింగ్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, మిల్లర్లతో సంబంధం లేకుండా రైతుల నుంచి సేకరించాలన్నారు. మిల్లర్లు పలు కారణాలు చూపి ధరలు తగ్గించే అవకాశం ఉందన్నారు. రైతులకు నష్టం జరగరాదన్నారు. ఇందులో భాగంగా వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం మిల్లులను తరచూ తనిఖీ చేయాలని,  డీఎస్‌ఓ, డీఎం, లీగల్‌ మెట్రాలజీ  అధికారులు ప్రతి నెలా ఎన్ని తనిఱీలు చేశారో కమిషనర్‌ ఎండీలకు వివరాలు పంపాలన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఖరీఫ్‌ ధాన్యం సేకరణపై ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. పౌరసరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో భాగంగా పౌరసరఫరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు వివరించారు. అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, జిల్లాల జాయింట్‌ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.విశ్వనాఽఽథన్‌,  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ స్వరూపిణి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల డీఎస్‌ఓలు, డీఎంలు లీగల్‌మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising