ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అచ్యుతాపురంలో ఫ్యాప్టో నిరసన

ABN, First Publish Date - 2022-08-18T06:26:08+05:30

హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవే శపెట్టి ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బుధవారం మండల రీసోర్సు భవనం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

మండల రీసోర్సు భవనం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్యుతాపురం రూరల్‌, ఆగస్టు 17: హాజరు నమోదు కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవే శపెట్టి ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బుధవారం మండల రీసోర్సు భవనం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రోజూ ఉదయం తొమ్మిది గంటల లోపు ముఖ హాజరు నమోదు చేసుకోకపోతే ఆ రోజు సెలవు కింద పరిగణిం చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మెనూ వివరాలు, మరుగుదొడ్ల క్లీనింగ్‌, విద్యార్థుల మార్కులు, విద్యా కానుక కిట్లు పంపిణీ, తదితర వివరాలను పలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల విద్యాబోధన కుంటుపడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో ఆయా సమాచారాన్ని సకాలంలో అప్‌లోడ్‌ చేయలేకపోతున్నామని అన్నారు. ఇప్పుడు సొంత ఫోన్లలో హాజరు యాప్‌ను డౌన్‌లోడు చేసుకుని, రోజూ ఉదయం 9 గంటలలోపు ముఖ హాజరును అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అన్నారు. కాగా మండలంలోని కాజీపాలెం హైస్కూల్‌ ఉపాధ్యాయులు ముఖ హాజరు వేయబోమని ప్రధానోపాధ్యాయునికి లేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జి.మధు, వి.శ్రీలక్ష్మి, బి.శంకరావు, పి.నాగేశ్వరరావు, ఎం.నానాజీ, జి.సూర్యప్రకాష్‌, బి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising