ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఈసీఎస్‌ కోసం తప్పుడు మెయిల్స్‌

ABN, First Publish Date - 2022-12-07T00:50:25+05:30

తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాన్ని (ఆర్‌ఈసీఎస్‌)...తిరిగి సొసైటీ పరిధిలోకి తీసుకురావడానికి వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంతో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సిఫారసు చేయించుకున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాన్ని (ఆర్‌ఈసీఎస్‌)...తిరిగి సొసైటీ పరిధిలోకి తీసుకురావడానికి వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వంతో విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సిఫారసు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఈఆర్‌సీ ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది. ప్రజాభిప్రాయం మేరకు ముందుకువెళ్లాలని భావించి, ఈ నెల 14న హైదరాబాద్‌లో అభిప్రాయాలు చెప్పాలని ఈఆర్‌సీ ప్రకటన జారీచేసింది. రాష్ట్రం కాని రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటనే విమర్శలు రావడంతో దూరాభారం వల్ల రాలేని వారు ఎవరైనా వుంటే ఈ-మెయిల్‌ ద్వారా వారి అభిప్రాయాలు పంపవచ్చునని ప్రకటించింది. ఇదే అదునుగా భావించిన వైసీపీ నేతలు, ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులు మరో కుట్రకు తెర తీశారు. పలు సెక్షన్‌లలో పనిచేస్తున్న ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులు...తమకు తెలిసిన వినియోగదారుల సర్వీస్‌ నంబర్లు తీసుకొని, వారి పేర్లతో తప్పుడు మెయిల్స్‌ పంపుతున్నారు. ఈపీడీసీఎల్‌ నుంచి విముక్తి కలిగించాలని, సొసైటీగా నడుపుకోవడానికి అవకాశం కల్పించాలని అందులో పేర్కొంటున్నారు. ఇలా వందల సంఖ్యలో పంపుతుండడం వల్ల ఈఆర్‌సీ వాటికే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది.

వద్దే వద్దు...వినియోగదారులకు ప్రయోజనం లేదు

ఆర్‌ఈసీఎస్‌ను సొసైటీ నడపడం వల్ల తమకు కలిగే అదనపు ప్రయోజనాలు గానీ, ఈపీడీసీఎల్‌ నడిపితే ప్రత్యేకించి వచ్చే నష్టాలు గానీ ఏమీ లేవని పలువురు వినియోగదారులు, సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఎవరు విద్యుత్‌ ఇచ్చినా ఒకలానే ధర తీసుకుంటున్నారని, కాకపోతే సొసైటీ నడిపితే...వారికి తక్కువ ధరకు విద్యుత్‌ వస్తుందని, ఆ లాభాలన్నీ సొసైటీ అధికారులు, రాజకీయ నాయకులు పంచుకుంటారంటున్నారు. అందుకే సొసైటీ పరిధిలో ఉంచాల్సిందిగా కోరుతున్నారన్నారు. అదే ఈపీడీసీఎల్‌ నడిపితే నష్టమైనా, లాభమైనా ప్రభుత్వానికే ఉంటుందని, దళారులకు అవకాశం ఉండదంటున్నారు. మళ్లీ సొసైటీకి ఇవ్వడం న్యాయం కాదని అంటున్నారు. ప్రతి నెలా కోట్ల రూపాయలు పక్కకు తప్పించడానికే వైసీపీ నేతలు ఈ ఎత్తుగడలు వేస్తున్నారని, వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవద్దని సూచిస్తున్నారు.

Updated Date - 2022-12-07T00:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising