ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయింపు

ABN, First Publish Date - 2022-08-11T06:38:14+05:30

తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం దక్షిణ నియోజకవర్గంలో 29వవార్డు చందకవీధిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

చందకవీధిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పార్టీ  ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఆరోపణ

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. బుధవారం దక్షిణ నియోజకవర్గంలో 29వవార్డు చందకవీధిలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తప్పుచేసిన విషయం బయటకు వస్తే ఆయనను రక్షించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ధ్వజమెత్తారు.  అఽధికారంలో ఉన్నామన్న అహంకారంతో ప్రభుత్వ పెద్దలు దోషులను కాపాడు తున్నా భవిష్యతులో ప్రజాకోర్టులో శిక్ష పడక తప్పదన్నారు. సోషల్‌ మీడియా కేసుల్లో కఠినంగా ఉండే పోలీసులు గోరంట్ల మాధవ్‌ విషయంలో ఎందుకు వెన క్కు తగ్గుతున్నారని ప్రశ్నించారు. మాధవ్‌ విషయంలో అక్కడి ఎస్పీ మనను చంపుకుని మాట్లాడినట్టు అతని ముఖ కవళికలు చూస్తే తెలుస్తోందన్నారు.  ప్రభుత్వంపై పోలీసులే తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. దక్షిణ  ఎమ్మెల్యేగా ఎన్నికై, వైసీపీ పంచనచేరిన వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ఇక్కడి ప్రజలు బుద్దిచెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. అనంతరం విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌చార్జి గండిబాబ్జీ మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. చెత్త పన్ను పేరిట ప్రతి ఇంటి నుంచి వసూలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న, బాబ్జీలు వార్డులో పలువర్గాల ప్రజలను కలుసుకుని ప్రభుత్వ పాలనలో ఇబ్బందులను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాతాజీ, సురేంద్ర, పొడుగు కుమార్‌, సూర్యనారాయణ, గణేష్‌, సీఎం రమణ, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:38:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising