అన్ని వర్గాల దోపిడీయే వైసీపీ ధ్యేయం
ABN, First Publish Date - 2022-10-17T06:02:04+05:30
అన్ని వర్గాలను దోచుకోవడమే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతున్నదని పాడేరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి
కొయ్యూరు, అక్టోబరు 16: అన్ని వర్గాలను దోచుకోవడమే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతున్నదని పాడేరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. మండలంలోని కొమ్మిక, కర్ణికపాలెం, బొర్రంపేట, కంఠారం గ్రామాల్లో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొమ్మికలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈశ్వరి మాట్లాడుతూ అధికారం కోసం అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో జగన్ మోసగించారన్నారు. ప్రధానంగా నిత్యావసర సరకుల ధరలను అమాంతంగా పెంచేసి పేదలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రమంతా అప్పులు... రోడ్లన్నీ గోతులేనని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులతో వైసీపీ నేతలకు లబ్ధి తప్పితే సామాన్యుల స్థితిగతుల్లో మార్పు ఉండదన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకుని జగన్‌ను గద్దె దించాలని, లేకుంటే ఆంద్రప్రదేశ్ మనుగడ కష్టమవుతుందని ఈశ్వరి పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు అంధకారంలోకి వెళ్లకుండా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గొలుసింగి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఉల్లి వెంకటేశ్వర్లు, కార్యదర్శి తోట దొరబాబు, ఎస్‌టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొర్రు రామ్మూర్తి, నియోజకవర్గ తెలుగుయువత కార్యదర్శి కురుజు శ్రీనుబాబు, అరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సాంబశివరావు, సర్పంచ్ పీటా సింహాచలం పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T06:02:04+05:30 IST