ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా భోజన మెనూ అమలు

ABN, First Publish Date - 2022-12-15T00:17:18+05:30

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు భోజన మెనూ సక్రమంగా అమలు చేయాలని ఉపాధ్యాయులను గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు ఆదేశించారు.

బంగారుమెట్ట ఆశ్రమ పాఠశాలలో రికార్డులు తనిఖీ చేస్తున్న టీడబ్ల్యూ డీడీ కొండలరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ కొండలరావు

పలు మారుమూల ప్రాంత ఆశ్రమాల ఆకస్మిక తనిఖీ

పాడేరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు భోజన మెనూ సక్రమంగా అమలు చేయాలని ఉపాధ్యాయులను గిరిజన సంక్షేమ విద్యాశాఖ ఉప సంచాలకుడు ఐ.కొండలరావు ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలోని పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దు ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. పెదగూడ, కిలగాడ, బంగారుమెట్ట, కొరవంగి, రూడకోట తురకలవలస ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్లు, క్లాస్‌ టీచర్లకు పలు సూచనలు చేశారు. బోధనతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, భోజన మెనూ పక్కాగా పాటించాలని, విద్యా కానుకలను ప్రతి విద్యార్థికి అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ఆశ్రమ పాఠశాల నిర్వహణకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. హైకోర్టు జువెనైల్‌ జస్టిస్‌ ఆదేశాల మేరకు ఇతర వ్యక్తులను ఆశ్రమ పాఠశాలల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు డిప్యూటీ వార్డెన్‌ మార్పులను కొనసాగించాలని సూచించారు.

Updated Date - 2022-12-15T00:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising