ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈపీడీసీఎల్‌ కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన

ABN, First Publish Date - 2022-12-16T01:10:37+05:30

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివరాలు శూన్యం

ప్రస్తుతానికి భారం ఉండకపోవచ్చునంటున్న అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ టారిఫ్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పెరుగుతున్న అవసరాలు, కొనుగోళ్లు, ఆదాయం, లోటు వంటి అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కలతో పాటు ప్రస్తుతం శ్లాబుల వారీగా వసూలు చేస్తున్న చార్జీలు, పెంచాలని భావిస్తున్న టారిఫ్‌లు వెల్లడించాల్సి ఉంది. కానీ ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించిన నివేదికలో ఎక్కడా ప్రతిపాదిత టారిఫ్‌లు వెల్లడించలేదు. ఎంత విద్యుత్‌ అవసరం?, ఎంత ఆదాయం వస్తుంది?, యూనిట్‌ వ్యయం ఎలా ఉండబోతుందీ అనే వివరాలనే పేర్కొంది. అయితే రాబోయేది ఎన్నికల సీజన్‌ కావడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా విద్యుత్‌ చార్జీలు పెంచకపోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏమైనా నష్టాలు, లోటు వుంటే ప్రభుత్వం వాటిని భరిస్తుందని అంటున్నారు.

ఇవీ లెక్కలు

- 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌టీ విద్యుత్‌ కోసం 13,300.19 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేయగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 14,024.37 మిలియన్‌ యూనిట్లు అవసరమని లెక్కలు వేశారు.

- హెచ్‌టీ విద్యుత్‌ అయితే ప్రస్తుత ఏడాది 12,124.16 మిలియన్‌ యూనిట్లు కాగా వచ్చే ఏడాది 12,968.12 మిలియన్‌ యూనిట్లు అవసరమని అంచనా వేశారు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుత ఏడాది 25,424.35 మిలియన్‌ యూనిట్లు కొనుగోలు చేస్తుండగా, వచ్చే ఏడాది 26,992.49 మిలియన్‌ యూనిట్లు కొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

వ్యయం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌టీ, హెచ్‌టీ విద్యుత్‌ కోసం రూ.14,247.60 కోట్లు వెచ్చించగా, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.15,189.16 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

రెవెన్యూ లోటు రూ.3,800 కోట్లుగా అంచనా

ఆదాయానికి, వ్యయానికి మధ్య రూ.3,800 కోట్లు వరకు గ్యాప్‌ ఉంటుందని, వాస్తవానికి దీనిని చార్జీలు పెంచడం ద్వారా భర్తీ చేసుకోవలసి ఉంటుందని, కానీ ప్రభుత్వం తానే ఆ మొత్తం సర్దుబాటు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఈసారి చార్జీలు పెంచబోవడం లేదని అధికార వర్గాల సమాచారం. అయితే ఈ మొత్తాలు ఎప్పటికైనా వినియోగదారుల నుంచి వసూలు చేయకతప్పదని, ఇప్పుడు కాకపోతే రెండేళ్ల తరువాత అయినా సర్‌చార్జీల రూపంలో బాదుడు ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

యూనిట్‌ విద్యుత్‌ వ్యయం ఇలా...

యూనిట్‌ కొనుగోలు ధర రూ.4.63

పంపిణీ నష్టాలు రూ.0.51

నెట్‌వర్క్‌ వ్యయం రూ.1.89

ఇతర ఖర్చులు రూ.0.22

----------------------------------------------

మొత్తం ఖర్చు రూ.7.25

--------------------------------------------

Updated Date - 2022-12-16T01:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising