ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్లుప్పిలో పులి అలజడి

ABN, First Publish Date - 2022-08-08T05:50:50+05:30

కె.కోటపాడు మండలం ఆర్లి సమీపంలో శుక్రవారం ప్రత్యక్షమైన పులి సుమారు ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని సబ్బవరం మండలం ఎల్లుప్పిలో శనివారం సాయంత్రం అలజడి సృష్టించింది.

పులి దాడిలో మృతి చెందిన ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడి చేయడంతో రెండు ఆవులు మృతి

మరో గేదెకు గాయాలు

ఇరవై రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలో మరోసారి కలకలం

బోను ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు


కె.కోటపాడు మండలం ఆర్లి సమీపంలో శుక్రవారం ప్రత్యక్షమైన పులి సుమారు ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని సబ్బవరం మండలం ఎల్లుప్పిలో శనివారం సాయంత్రం అలజడి సృష్టించింది. రెండు ఆవులపై దాడి చేసి చంపేసింది. మరో గేదెపై దాడి చేసి గాయపరిచింది. పులి సంచారంతో గ్రామస్థులు, అటవీ అధికారులకు కంటి మీద కునుకులేకుండాపోయింది.


సబ్బవరం, ఆగస్టు 7: సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామంలో పులి మరోసారి కలకలం రేపింది. శనివారం సాయంత్రం 6 గం టల సమయంలో నల్లకొండ అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న రైతు కొట్యాడ అప్పలరాము కల్లం వద్ద రెండు ఆవులపై దాడి చేసి చంపేసింది. ఒక గేదెపై దాడి చేసి గాయపరిచింది. దాడి చేసి చంపే సిన ఒక ఆవును అడవిలోకి ఈడ్చుకుపోయింది. ఈ దృశ్యాన్ని రైతు అప్పలరాము దూరం నుంచి చూసి భయాందోళనకు గురయ్యాడు. అట వీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. దాడి చేసింది పులేనని నిర్ధారణకు వచ్చి ఆవును ఈడ్చుకుపోయిన ప్రాం తాన్ని గుర్తించారు. మళ్లీ పులి తిరిగి వస్తుం దని భావించి అక్కడ నిఘా పెట్టారు. అదే ప్రాంతంలో బోను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఆర్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బోనును ఎల్లుప్పి తరలించేందుకు ప్రయత్నాలు చేశారు. వర్షం పడడంతో పాటు గ్రామానికి దూరంగా ఈ ప్రదేశం ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నా యని అధికారులు తెలిపారు. అయినప్పటికీ బోను ఏర్పాటు చేయాలని పెందుర్తి ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ రామారావు ఆదేశించారు. అటవీ అధి కారులు ఆదివారం కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా ఆదివారం సాయంత్రం బోను ఏర్పాటు చేశారు.

అదే ప్రదేశంలో మరోసారి..

సుమారు ఇరవై రోజుల క్రితం ఎల్లుప్పిలో ఎక్కడైతే పులి దాడి చేసి ఆవు పెయ్యిను చంపేసిందో శనివారం అదే ప్రదేశానికి మళ్లీ పులి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అప్పట్లో సబ్బవరంలో నారపాడు, నల్లరేగులపాలెం, గాలిభీమవరం, వంగలి ప్రాంతంలో పులి సంచరించి ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అంతే కాకుండా ఆవులు, మేకలపై దాడి చేసి చంపేసింది. మళ్లీ  ఇప్పుడు ఇక్కడికి రావడంతో ఎల్లుప్పితో పాటు పరసర గ్రామాలైన బోదివలస, మర్రిపాలెం, అయ్యన్న పాలెం గ్రామాల ప్రజలు భీతిల్లుతున్నారు. 

ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో..

నల్లకొండ ఫారెస్టు ఎల్లుప్పి మొదలుకొని కోటపాడు, సబ్బవరం, చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీంతో పులి ఆవాసానికి అనువుగా ఉంది. అందు వల్ల దీర్ఘకాలం ఇక్కడే సంచరించే అవకాశం ఉందని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నట్టు వారు చెబుతున్నారు. కాగా పశువులను గ్రామానికి తెచ్చుకోవాలని, ఒంటరిగా తోటలోకి పశువులను మేతకు తోలవద్దని ప్రజలకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-08-08T05:50:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising