ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ సభకు డ్రెస్‌ కోడ్‌..!

ABN, First Publish Date - 2022-11-24T03:05:06+05:30

‘‘రాష్ట్రంలో సీఎం జగన్‌ సభలకు నల్ల డ్రెస్‌ వేసుకొని ఎవరు వెళ్లినా పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలా లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేస్తుందేమో

సీఎం సభలో మహిళల చున్నీలు తీయించేస్తే మహిళా కమిషన్‌ ఏం చేస్తున్నట్లు

మద్యం కుంభకోణంతో కేంద్రం ఆదాయానికి గండి: విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో సీఎం జగన్‌ సభలకు నల్ల డ్రెస్‌ వేసుకొని ఎవరు వెళ్లినా పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలా లేదు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేస్తే అందరికీ అర్థమవుతుంది’’ అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్‌రాజు ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నరసాపురం సభకు మహిళలు నల్ల చున్నీలు వేసుకొని వెళితే... వాటిని పోలీసులు లాక్కున్నారు. విశాఖపట్నంలో ఈ నెలలో జరిగిన సభకు అయ్యప్ప భక్తులు నల్లడ్రె్‌సతో వస్తే... వారినీ అనుమతించలేదు. నరసాపురంలో మహిళల పట్ల పోలీసులు అంత దారుణంగా వ్యవహరిస్తే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఏమి చేస్తున్నారు? వైసీపీ నేతల విమర్శలకు పవన్‌ కల్యాణ్‌ ప్రతి విమర్శ చేస్తే దానిని వివాదాస్పదం చేసిన ఆమెకు... ఇప్పుడు మహిళలకు జరిగిన అవమానం కనిపించలేదా? తక్షణమే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విశాఖలో దసపల్లా భూములను 22-ఏ జాబితా నుంచి తప్పించాలని కలెక్టర్‌పై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం పెద్దఎత్తున జరుగుతోంది. సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. దీనివల్ల కేంద్రం ఆదాయానికి గండి పండింది. అందుకనే విచారణ చేయాలంటూ రాష్ట్ర బీజేపీ తరఫున కోరతాం. ఏప్రిల్‌ నుంచి విశాఖలో సీఎం పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే రుషికొండలో శరవేగంతో నిర్మాణాలు చేపడుతున్నారు. బీజేపీ మాత్రం అమరావతి రాజధానికే కట్టుబడి ఉంది. రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో లేవు. మార్కెట్‌లోనూ కనిపించడం లేదు. ఎవరు బ్లాక్‌ చేశారో తేల్చేందుకు ఆర్‌బీఐతో విచారణ చేయించాలి’’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-24T03:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising