ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడ పిల్లలను చులకనగా చూడవద్దు

ABN, First Publish Date - 2022-08-10T06:14:12+05:30

ఆడ పిల్ల అని నిరుత్సాహ పడవద్దని.. వారిని చులకనగా చూడవద్దని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు.

చిన్నారిని ఎత్తుకొని పథకాల గురించి అడుగుతున్న ముత్యాలనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు 

దేవరాపల్లి, ఆగస్టు 9: ఆడ పిల్ల అని నిరుత్సాహ పడవద్దని.. వారిని చులకనగా చూడవద్దని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం పెదనందిపల్లి సత్యనారాయణపురం కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు అందుతున్నది? లేనిదీ అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అంటూ గ్రామస్థులను ప్రశ్నించారు. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు సుమారు రూ.నాలుగు కోట్లు ఖర్చు చేశామని, గ్రామ అభివృద్ధి కోసం మరో రూ.20 లక్షలు, జలజీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికి నీరు అందించడానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో కొత్త కళ్లాల కాలనీలకు సోలార్‌ లైట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. అన్ని వీధుల్లో సీసీ రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ మూర్తిని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, మాజీఎంపీపీ కిలపర్తి భాస్కరరావు, బూరే బాబూరావు, రొంగలి.నారాయణమ్మ, వి.సింహాచలంనాయుడు, రామ్మూర్తినాయుడు, చోడవరం సీఐ తాతారావు, సర్పంచ్‌ సన్నిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T06:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising